సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. గంటకు 150 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్న ఈ యువ పేసర్ బ్యాటర్ల పాలిట సింహాస్వప్నంలా మారుతున్నాడు. బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో 4 కీన్ బౌల్డ్ కావడం విశేషం. గిల్, సాహా, మిల్లర్, హార్థిక్ పాండ్యా, అభినవ్ వంటి స్టార్ ప్లేయర్ల వికెట్లు తీశాడు. ఉమ్రాన్ ప్రత్యేకత వేగం. ఇప్పటి వరకు మరే ఇండియన్ బౌలర్ వేయని వేగంతో ఉమ్రాన్ బౌలింగ్ వేస్తున్నాడు.
గుజరాత్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయినా కూడా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉమ్రాన్‌కే లభించిందంటే అర్థం అవుతుంది అతను ఎలాంటి బౌలింగ్ చేశాడో. ఈ మ్యాచ్‌తో ఉమ్రాన్ మాలిక్ ఒక గొప్ప అవకాశం పొందేందుకు దారులు పడ్డాయని క్రికెట్‌నిపుణులు భావిస్తున్నారు. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఉమ్రాన్ మాలిక్‌ను టీమిండియాలోకి తీసుకునేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అద్భుతమై వేగంతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్.. ఆస్ట్రేలియా పిచ్‌లపై చాలా టీమిండియాకు ఎంతో ఉపయుక్తంగా ఉండటాని బీసీసీఐ పెద్దలు కూడా భావిస్తున్నారు.అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ ఆస్ట్రేలియాలోనే జరగనుంది. ఇప్పటికే బుమ్రా, షమీ, సిరాజ్‌లతో పటిష్టంగా ఉన్న టీమిండియా బౌలింగ్ లైనప్ ఉమ్రాన్ మాలిక్‌తో మరింత దుర్భేధ్యంగా మారనుంది. సిరాజ్‌ను పక్కన పెట్టినా ఈ సారి ఉమ్రాన్ మాలిక్‌కు టీమిండియాలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఉమ్రాన్ మాలిక్ టీమిండియాలోకి వస్తే ఎలా ఉంటుందనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోని, కోహ్లీ, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలేదు! ఉమ్రాన్ మాలిక్ సాధించాడు
Umran Malik’s fiery spell yesterday 💥.#IPL2022pic.twitter.com/THFZ2SlGLN
— Ketan (@ketanbangerking) April 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.