ఉమ్రాన్ మాలిక్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన ఈ సన్‌రైజర్స్ యువ పేసర్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అద్భుత ప్రదర్శన అని ఒకరు, ఆ స్పీడ్ చూస్తుంటే మాజీ క్రికెటర్లు గుర్తొస్తున్నారని మరొకరు, టీమిండియాకు గొప్ప స్పీడ్ బౌలర్ దొరికాడని మరికొందరు.. ఇలా విదేశీ క్రికెటర్లు సైతం ఈ యువ క్రికెటర్ పై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో ఉమ్రాన్ గంటకు 150 కి.మీ. వేగంతో బంతులు వేస్తూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఉమ్రాన్ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేసిన ఉమ్రాన్.. టీమిండియా పిలుపును అందుకున్నాడు. సౌతాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికైన ఉమ్రాన్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఉమ్రాన్ అరుదైన రికార్డు సృష్టించాడు. 163.7 కీ.మీ. వేగంతో బాల్ సంధించి ఔరా అనిపించాడు. కాకుంటే ఇది ప్రాక్టీస్ సెషన్ లో జరగడంతో.. అంత గుర్తింపు రావట్లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: Brett Lee: ఉమ్రాన్ మాలిక్‌కు..నేనూ అభిమానినే! బ్రెట్ లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇప్పటివరకు ఫాస్టెస్ట్ బాల్ వేశానని గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఇది దిమ్మతిరిగే సమాధానమనే చెప్పొచ్చు. ఇప్పటివరకు ఫాస్టెస్ట్ బాల్ రికార్డు షోయబ్ అక్తర్ పేరిట ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన ఓ మ్యాచులో అక్తర్ 161.3 కీ.మీ. వేగంతో బాల్ వేశాడు. ఇక.. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు ఆడిన ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచుల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఓ మ్యాచులో 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు.
Umran Malik has bowled 31 deliveries over 150+kmph in IPL 2022….
..#ipl #umranmalik #ipl9 #iplik #ipl10 #playtown #iplayslinky #ipltreatment #iplworlds #iplaytoomuch #iplayeastman #iplug #iplhairremoval #iplay #iplt20 #iplehouse #iplanevents #ipleadthe2nd #ipledge #iplann pic.twitter.com/iolAGQyaTr
— Cricsky (@Cricsky1) June 3, 2022