ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ క్రికెటర్లు ఒక ఇంటివారవుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకుంటూ.. వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, ఐపీఎల్లో కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున బరిలో దిగనున్న ఆల్‌రౌండర్ టీమ్ సౌథీ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. బ్రయా ఫహీతో కలిసి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు సౌథీ. దీంతో పలువురు క్రికెటర్లు, అభిమానులు నూతన దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
కాగా.. సౌథీ-బ్రయా చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. సహజీవనం కూడా చేస్తున్నారు. తమ ప్రేమకు గుర్తుగా వీరికి ఇండీ మే సౌథీ, స్లోయానే అవా సౌథీ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఈ జట్టు పెళ్లితో అధికారికంగా ఒక్కటైంది. కాగా న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాడిగా పేరున్న సౌథీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల తరఫున ఆడాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.1.5 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను కొనుగోలు చేసింది. మరి టీమ్ సౌథీ వివాహంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.ఇదీ చదవండి: ఐపీఎల్ లో అవమానం.. కానీ అక్కడ మాత్రం రైనాకు ప్రతిష్టాత్మక అవార్డు
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.