శిఖర్‌ ధావన్‌ దంపతుల విడాకులు.. సోషల్‌ మీడియాలో వైరల్‌!

shikhar dhawan

టీమిడింయా ఓపెనర్‌, స్టార్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. శిఖర్‌ ధవన్‌, తాను విడిపోయినట్లు ఆయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుధీర్ఘ పోస్టు ద్వారా తెలియజేసింది. 2012లో ఒక్కటైన ఈ జంట తాజాగా విడాకులు తీసుకున్నారు. ఆయేషా ముఖర్జీకి ఇది రెండో వివాహం. మొదట ఆసీస్‌కు చెందిన ఓ బిజినెస్‌ మ్యాన్‌తో విడాకులు తీసుకుంది. శిఖర్‌ వివాహమాడే సమయానికే ఆయేషాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ధవన్‌ ఆయేషా కుమార్తెలను దత్తత తీసుకున్నాడు. శిఖర్‌, ఆయేషాలకు ఓ కుమారుడు జన్మించాడు. ధవన్‌ ఆయేషా కుమార్తెలను కూడా చాలా ప్రేమగా చూసుకునేవాడు. విదేశీ పర్యటనలు, మ్యాచ్‌లు ఎక్కడికైనా అందరూ కలిసే వెళ్లేవారు.

shikhar dhawanమాజీ కిక్‌‌‌‌‌‌‌‌ బాక్సర్‌ ఆయేషా ముఖర్జీ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో పుట్టి మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌లో సెటిలైంది. ఆయేషా, శిఖర్‌ ధావన్‌లకు హర్భజన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా పరిచయం ఏర్పడింది. శిఖర్‌ ధవన్‌ కంటే ఆయేషా 11 సంవత్సరాల పెద్దది. తొమ్మిదేళ్లు ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఒక్కసారిగా విడాకులు తీసుకోవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. తన పోస్టులో డైవర్స్‌ అనే పదానికి ఆయేషా ఎన్నో అర్థాలను రాసింది. అసలు ఎందుకు వీళ్లు విడాకులు తీసుకున్నారో తెలీదు. అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్లు ఎందుకు విడిపోయారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Aesha Mukerji (@apwithaesha)