కోహ్లీపై రోహిత్‌ శర్మ సీరియస్‌.. టీమ్‌ రెండుగా చీలిపోనుందా?

rohit virat

టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత కోహ్లీ టీ20 జట్టు కెప్టెన్‌గా తప్పుకోనున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కోహ్లీనే స్వయంగా ప్రకటించాడు. ఆ విషయంపై మొదట వచ్చిన లీకులను బీసీసీఐ కొట్టిపారేసింది. కానీ, చివరకు అదే జరిగింది. తాజాగా కోహ్లీ బీసీసీఐ ఎదుట ఓ ప్రతిపాదన ఉంచాడన్న వార్తలు కూడా నిజమే అని అందరూ నమ్మేస్తున్నారు. అందరి సంగతి పక్కన పెడితే ఈ వార్త విన్నాక హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ కూడా బాగా హీట్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. వారి మధ్య మళ్లీ వైరం మొదలైందని అందరూ అంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గతంలో క్రికెట్‌ అభిమానులు విన్న ఎన్నో మాటలను పుకార్లు కింద లెక్కగట్టారు. క్రీజులో కోహ్లీ, రోహిత్‌ మధ్య అవగాహన లోపం వల్ల కోహ్లీ రనౌట్‌గా వెనుతిరిగిన సందర్భంలో వారి మధ్య చెడిందని అందరూ అనుకున్నారు. అప్పుడు కోహ్లీ.. రోహిత్‌ ఆటను ఎంకరేజ్‌ చేస్తూ కనిపించగానే అందరూ కూల్‌ అయ్యారు. ఓసారి రోహిత్‌ గాయంపై నాకు సమాచారం లేదని కోహ్లీ చేసిన కామెంట్లను హైలెట్‌ చేస్తూ కోహ్లీకి రోహిత్‌ మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని ఫిక్స్‌ అయిపోయారు. బీసీసీఐ ఎదుట కోహ్లీ ఓ ప్రతిపాదన చేశాడని వార్త విన్న అందరూ మళ్లీ పాత గొడవల దాకా వెళ్లిపోయారు. రోహిత్‌ను వైస్‌ కెప్టెన్‌ నుంచి తొలగించాలని కోహ్లీ కోరాడన్న వార్తలపై ఇప్పుడు రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరమో కోహ్లీ కావాలనే ఇలా ప్రతిపాదించాడంటూ వాదిస్తున్నారు.

rohit sharma virat playingటీమిండియా కోసమేనా?

కొందరు కోహ్లీ ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. టీమిండియా కోసమే కోహ్లీ ఇలాంటి ప్రతిపాదిచాడంటున్నారు. వైస్‌ కెప్టెన్‌గా యువతను ఎంచుకుంటే వారికి రానున్న రోజుల్లో టీమిడింయా మరింత సమర్థంగా మారుతందని వాదిస్తున్నారు. కోహ్లీ అందుకే కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ పేర్లను ప్రతిపాదించాడని పేర్కొంటున్నారు. ఇప్పటి నుంచే యువతకు సారథ్యంలో అవకాశాలు కల్పిస్తే టీమిడింయా భవితవ్యం బాగుంటుందని కోహ్లీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

టీమిండియా రెండుగా చీలుతుందా?

టీ20 వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో అందరి దృష్టి కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌ వైరం మీదనే ఉంది. ఇప్పుడు వీర పర్సనల్‌ గొడవలతో టీమిండియా రెండు చీలుతుందా అనే అనుమానాలు.. భయాలు వ్యక్తపరుస్తున్నారు. మెగా టోర్నీ ముంగిట పెద్ద సంకటమే వచ్చిందంటున్నారు. వారి మధ్య నిజంగానే గొడవలు, భేదాభిప్రయాలు ఉంటే సాధమైనంత త్వరగా రవిశాస్త్రి వాటిని తీర్చే పనిలో ఉండాలని కోరుతున్నారు. గతంలోనూ వారి మధ్య మనస్పర్థలను రవిశాస్త్రినే క్లియర్‌ చేసినట్లు వార్తలు వినిపించాయి.

కోహ్లీ, రోహిత్‌ శర్మ మధ్య నిజంగానే వైరం నడుస్తోందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి