టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య.. ధనశ్రీ వర్మ గురించి స్పెషల్ గా పరిచయం చేయక్కర్లేదు. వృత్తిపరంగా వైద్యురాలు అయిన ధనశ్రీ వర్మ.. మంచి డ్యాన్సర్ అన్న విషయం కూడా తెలిసిందే. అప్పుడప్పుడూ భర్తతో కలిసి కూడా వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే.. "రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో.." పాటకు మాస్ స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేసిన ధనశ్రీ, తాజాగా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి పార్టీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆసియా కప్ 2022 ప్రిపరేషన్స్ కోసం చిన్నస్వామి స్టేడియంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్యాంపులో పాల్గొంటున్నాడు యజ్వేంద్ర చాహాల్. ఇక.. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్.. ఆసియా కప్ టోర్నీకి ఇంకా సమయం ఉండడంతో.. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత జట్టులో కలవబోతున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, దేవిశా శెట్టి ఇచ్చిన డిన్నర్ పార్టీకి శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి వెళ్లింది ధనుశ్రీ వర్మ. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా లో షేర్ చేశాడు సూర్య. 'సారీ చాహాల్.. మేం నిన్ను మిస్ అవ్వలేదు..'అంటూ కాప్షన్ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ధనశ్రీ గురించి ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి. నెటిజన్స్.. 'పాపం.. చాహల్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కొద్దీరోజుల కిందట ఇన్నాళ్లు చూపించకుండా దాచేసిన అందాలన్నీ బయటపెట్టేస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసిన ధనశ్రీ వర్మ ఫోటోలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక.. హీరో నితిన్ నటించిన చిత్రం ”మాచర్ల నియోజకవర్గం.”ఈ మూవీలో ”రారా రెడ్డి ఐయామ్ రెడీ” అనే పాటలో ఉన్న ‘రాను రానుఅంటూనే చిన్నదో.. చిన్నదో ‘ అనే మాస్ బీట్ కు ధనుశ్రీ తనదైన స్టెప్పులతో ఊపు తెప్పించింది. ఓవైపు పాట పాడుతూనే ఉర మాస్ డ్యాన్స్ తో అదరగొట్టింది. తన స్టెప్పులతోనే కాకుండా ఈ భామ తన అందచందాలతో కూడా చూసే వారి మతి పోగొట్టింది. ఈ విషయంలో.. చాహల్ కు మీరిచ్చే సలహా ఏదైనా ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) ఇదీ చదవండి: IND vs ZIM: ‘బీసీసీఐ ఎలాంటి జట్టును పంపినా..’ టీమిండియాకే వార్నింగ్ ఇచ్చిన జింబాబ్వే కోచ్! ఇదీ చదవండి: పుజారా అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు..! సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ