టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేష్ రైనా దశాబ్దకాలం పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఫూర్ ఫామ్ కారణంగా రైనాను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో రైనా ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలాడు. కానీ శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో రైనా భాగస్వామి కానున్నాడు. కానీ ప్లేయర్‌గా కాదు.. కామెంటేటర్‌గా. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా ఆడిన చెన్నై జట్టు గురించి మాట్లాడిన రైనా.. ధోని తర్వాత CSK కెప్టెన్ ఏవరనే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రైనా CSKలో ఉన్న సమయంలో ధోని గైర్హాజరీలో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ధోని కాకుండా.. CSKకు కెప్టెన్‌గా వ్యవహరించింది రైనా మాత్రమే. ఇప్పుడు తన CSKలో లేడు. దీంతో అతని స్థానం భర్తీ చేయగల ఆటగాళ్లు పేర్లను రైనా వెల్లడించాడు. ఆశ్చర్యకరంగా CSK స్టార్ ప్లేయర్, యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ పేరును రైనా పేర్కొనలేదు. రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, బ్రావో.. ధోని తర్వాత CSK కెప్టెన్సీని చేపట్టే అవకాశం ఉందని అన్నాడు. ఇందులో గైక్వాడ్ పేరు లేకపోవడంతో CSK ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రుతురాజ్‌కు అంత సీన్ లేదని రైనా భావించినట్లు క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
నిజానికి ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే వార్త కూడా ప్రచారం ఉంది. ఇప్పుడు ధోని వయసు 40 ఏళ్లు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో తప్పుకున్న ధోని.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇప్పటికే CSKను నాలుగు సార్లు విజేతగా నిలిపిన ధోని.. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందించి పూర్తిగా తప్పుకుంటాడని క్రికెట్ నిపుణులు సైతం భావిస్తున్నారు. ఇప్పటి వరకు ధోని ఉండడంతో చాలా బలంగా కనిపించిన CSK… ధోని తర్వాత కొంత బలహీనపడే ప్రమాదం ఉంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో CSK చాలా సాధారణ జట్టుగా కనిపించింది. కానీ ధోని అద్భుత కెప్టెన్సీతో టైటిల్ కొట్టింది. మరి ధోని తర్వాత CSKను అదే పంథాలో నడిపించే నాయకుడు ఎవరో వేచి చూడాల్సిందే. మరి రైనా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఐపీఎల్ లో అవమానం.. కానీ అక్కడ మాత్రం రైనాకు ప్రతిష్టాత్మక అవార్డు
Suresh Raina picks his four potential players. https://t.co/mzU9cN6xDl
— CricTracker (@Cricketracker) March 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.