ఐపీఎల్ 2022 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమితో ప్రారంభించింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ చేతిలో 61 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చెత్త బౌలింగ్, పేలవ బ్యాటింగ్‌తో.. ఐపీఎల్‌కి ముందు జట్టుపై వచ్చన ఆరోపణలను నిజం చేస్తూ.. దారుణ ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. ఏ దశలోనూ రాజస్థాన్ బ్యాటర్స్ ను కట్టడి చేయలేకపోయింది. కెప్టెన్ సంజూ శాంసన్ అర్ధ సెంచరీకి తోడు, దేవదత్త్ పడిక్కల్ చెలరేగడంతో.. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక ఛేదనలో సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. చివరలో మార్కరమ్ 57, వాషింగ్టన్ సుందర్ 14 బంతుల్లో 40 పరుగులతో మెరిసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఓటమి సన్ రైజర్స్ అభిమానులను బాగానే బాధ పెట్టింది. కానీ.., మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అడ్మిన్ చేసిన ఓ పోస్ట్.. SRH అభిమానులను ఇంకా ఎక్కువ బాధకి గురి చేస్తోంది.
ఇదీ చదవండి: భువనేశ్వర్ కుమార్ చేసిన ఆ తప్పే.. SRH కొంపముంచిదా!?
Gooooood morning 👀 pic.twitter.com/HHwa9pR0um
— Rajasthan Royals (@rajasthanroyals) March 29, 2022
మ్యాచ్ కి ముందు.. రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్ లో ఆరెంజ్ జ్యుస్ తో నిండిన ఓ గ్లాస్ ని గుడ్ మార్నింగ్ అంటూ పోస్ట్ చేశాడు అడ్మిన్. ఇక మ్యాచ్ పూర్తి అయ్యాక.. దానికి కొనసాగింపుగా మరో పోస్ట్ చేశాడు. గ్లాస్ లో ఆరెంజ్ జ్యుస్ అంతా తాగేసినట్టు.., పై నుండి ఆరెంజ్ ని పిండుతున్నట్టు ఉన్న ఆ ఇమేజ్.. ఇప్పుడు సన్ రైజర్స్ ఫ్యాన్స్ కోపానికి కారణం అవుతోంది. నిజానికి సన్ రైజర్స్ టీమ్ కి ఆరెంజ్ ఆర్మీ అని పేరు. దీంతో.. ఆరెంజ్ ని పిండేసి, ఆ జ్యూస్ అంతా తాగేశాము అని అర్థం వచ్చేలా సెటైరిక్ గా రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి రాజస్థాన్ టీమ్ రాయల్స్ అడ్మిన్ ఇలా సెటైరికల్ పోస్ట్ లు వేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా చాలానే పోస్ట్ లు చేశారు. దీంతో.. ఈసారి రాజస్థాన్ తో తలపడే మ్యాచ్ లో సన్ రైజర్స్ ఎలా అయినా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Goooood night! https://t.co/BwMIX7XzBY pic.twitter.com/cM336wJ5ts
— Rajasthan Royals (@rajasthanroyals) March 29, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.