స్మృతి మందాన అరుదైన రికార్డు.. తొలి భారత మహిళా క్రికెటర్‌ గా..

smruthimandana indiancricket century

టీమిండియా ఉమెన్‌ టీమ్‌ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో సింగిల్‌ టెస్టు ఆడుతున్నారు. క్వీన్స్‌ లాండ్‌లో టీమిండియా ఉమెన్‌ స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మందాన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మందాన 216 బంతుల్లో 127 పరుగులు సాధించింది. 80 నాటౌట్‌ ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన మందాన రెండోరోజు మొదటి సెషన్‌లో తన పింక్‌ సెంచరీని నమోదు చేసింది. తొలి మహిళా క్రికెటర్‌గా ఈ ఘనత సాధించింది స్మృతి మందాన.

smruthimandana indiancricket century

మూడు నెలలుగా పింక్‌ బాల్‌తో స్నేహం

స్మృతి మందాన చేసిన పనికి అందరూ షాకవుతున్నారు. తాను మూడు నెలల క్రితమే ఓ పింక్‌ బాల్‌ను ఆర్డర్‌ చేసింది. అప్పటి నుంచి ఆ పింక్‌ బాల్‌ను తన బ్యాగ్‌లో ఉంచుకుంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఆ బాల్‌ను తదేకంగా చూస్తూ దానిని అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. ‘పింక్‌ బాల్‌తో ప్రాక్టీస్‌ సెషన్‌లో ఎక్కువ సమయం దొరకదని నాకు తెలుసు. టెస్టు కంటే ముందు కేవలం రెండు సెషన్స్‌ మాత్రమే ప్రాక్టీస్‌ చేసేందుకు సమయం దొరికింది. అందుకే నేను మూడు నెలల క్రితం నుంచే పింక్‌ బాల్‌ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. కచ్చితంగా పింక్‌ బాల్‌ టెస్టులో ఆడాల్సి వస్తుందని నాకు అనిపించింది’ అని స్మృతి మందాన తెలిపింది. 2019 నవంబరు 23న పింక్‌బాల్‌ టెస్టులో సెంచరీ సాధించి తొలి భారత క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ రికార్డులకెక్కాడు. తాజాగా స్మృతి మందాన అక్టోబర్‌ 1న ఈ ఘనత సాధించింది.