ఓపెనింగ్‌ నుంచి ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్నా గెలిపించలేకపోయాడు!

dinesh chandimal

శ్రీలంక పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఖాతా తెరిచింది. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా.. సిరీస్‌లో మొదటి టీ20ని గెలిచి శుభారంభం చేసింది. 28 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కి దిగి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా టీమ్‌. ఓపెనర్లు డికాక్‌(36), హెండ్రిక్స్‌(38), మక్రమ్‌(48) ఆకట్టుకున్నారు. లంక బౌలర్లలో హసరంగ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు తీక్షణ, దాసున్‌, చమీరాలు తలో వికెట్‌ తీశారు.

dinesh chandimalలక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక ప్లేయర్లు తడబడ్డారు. 165 పరుగులు చేయాల్సి ఉండగా.. లంక బ్యాట్స్‌మెన్లు 20 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేయగలిగారు. వికెట్లు ఇవ్వకపోయినా రన్స్‌ చేయడంలో విఫలమయ్యారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి ఎవరంటే.. లంక ఓపెనర్‌ ధినేష్‌ చండీమల్‌(66 పరుగులు నాటౌట్‌). ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చి ఆఖరి బంతి వరకు క్రీజులో ఉన్నాడు. తన వంతుగా 66 పరుగులు చేశాడు. కానీ, టీమ్‌ మాత్రం గెలిపించలేకపోయాడు. మిగిలిన బ్యాట్స్‌మన్ల నుంచి పెద్దగా సహకారం లభించకనే ఇలా జరిగింది. మూడు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.