రేపటి(శనివారం) నుంచి ధనాధన్ క్రికెట్ హంగామా ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. మ్యాచ్ కోసం ఫ్యాన్స్ అంతా రెడీ అయితే.. ధోని మాత్రం భారీ షాక్ ఇచ్చాడు. CSK కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ధోని నిర్ణయంతో CSK పరిస్థితి ఎలా ఉన్నా.. ఒక విషయంలో మాత్రం రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2022 సీజన్లో మొత్తం పది జట్లు బరిలో దిగనున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఈ పది టీమ్‌లకు ప్రస్తుతం కెప్టెన్ల అనుభవాన్ని పరిశీలిస్తే.. అందరికంటే టాప్‌లో రోహిత్ శర్మ ఉన్నాడు. గతంలో ఎన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు అనే విషయంలో రోహిత్ ఇప్పుడు అందరికంటే ముందున్నాడు. ధోనీ తప్పుకోవడంతో రోహిత్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటికే ఐదు టైటిళ్లు గెలిచిన హిట్ మ్యాన్.. 129 ఐపీఎల్ మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. మిగతా కెప్టెన్లలో ఎవరికీ కూడా అతనిలో సగం మ్యాచ్‌ల అనుభవం కూడా లేదు. గత సీజన్‌తోనే విరాట్ కోహ్లీ సారథ్యాన్ని వదులు కోవడం, ప్రతికూల పరిస్థితుల్లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ కోల్పోవడంతో అన్ని జట్లు తమ కొత్త సారథులను ఎంచుకున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ మినహా.. అంతా కొత్త సారథులే ఉన్నారు.
రోహిత్ శర్మ తర్వాత కోల్కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యరే 41 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(33), లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(27), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్(16), రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్(14), పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్(1) ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా అనుభవమున్న డుప్లెసిస్‌ను ఆర్సీబీ తమ నూతన సారథిగా ఎంచుకుంది. కానీ ఐపీఎల్ కెప్టెన్సీ మాత్రం కొత్తే. ఇక హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తొలిసారి కెప్టెన్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ నడిపిస్తుండగా.. చివరి నిమిషంలో సీఎస్కే సారథిగా జడేజా ఎంపికయ్యాడు. ఇలా ధోని నిర్ణయంతో రోహిత్ శర్మ టాప్‌లో CSK కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా లాస్ట్‌లో నిలిచాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోని CSK కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం?
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.