టీమిండియా స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షమీ ఐపీఎల్ 2022 సీజన్లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌ను సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడి అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో షమీ సూపర్ బౌలింగ్‌తో అదరగొట్టాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు.. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, అలాగే మనీష్ పాండేలను అవుట్ చేసి లక్నోను చావు దెబ్బ తీశాడు.
నాలుగు ఓవర్లు వేసిన షమీ 25 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా షమీ ప్రదర్శనపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. అలాగే పొర్న్స్టార్ కేంద్రా లస్ట్ కూడా షమీ ప్రదర్శనపై స్పందించడం విశేషం. షమీ అద్భుత ప్రదర్శన కనబర్చాడంటూ కేంద్రా ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ.. ఈ బ్రాండ్ నేమ్ విలువెంతో తెలుసా..?
Absolutely wonderful performance by @mdshami11 😍👏#LSGvsGT #IPL2022
— Kendra Lust™ (@KendraLust) March 28, 2022
A fiery spell from Mohammed Shami.
📸: IPL/BCCI#IPL2022 | @MdShami11 | #GT pic.twitter.com/RQk0ctzyhZ
— CricTracker (@Cricketracker) March 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.