ఆస్ట్రేలియా విషయంలో నిజమైన ‘లెఫ్ట్‌ సెంటిమెంట్‌’!

Aus vs Nz Match

టీ20 వరల్డ్‌ కప్‌ 2021ని ఆస్ట్రేలియా గెలిచింది. వన్డే వరల్డ్‌ కప్‌ను ఐదుసార్లు సాధించిన కంగారులకు ఇదే మొదటి టీ20 వరల్డ్‌ కప్‌. ఇక ఫైనల్‌లో ఓటమితో న్యూజిలాండ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆ జట్టుకు కూడా ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వరల్డ్‌ కప్‌ కూడా లేదు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌ జరగడానికి ముందు సోషల్‌ మీడియాలో ఒక చర్చ నడిచింది. మ్యాచ్‌ ముగిశాక.. కొంతమంది చెప్పిన ఒక విషయం నిజమైంది. అదే ‘లెఫ్ట్‌ సెంటిమెంట్‌’. ఏ ఐసీసీ మెగా టోర్నీలోనైనా ఫైనల్‌కు చేరిన జట్ల కెప్టెన్లు మ్యాచ్‌కు ముందు రోజు కప్‌తో ఫొటో దిగుతారు. ఇలా ఫొటో దిగే సమయంలో కప్‌కు ఎడమవైపు నిల్చునే కెప్టెన్‌ ఫైనల్‌లో ట్రోఫీని ముద్దాడుతాడు. అంటే అతని జట్టు విశ్వవిజేతగా నిలుస్తుంది.

ఇది కొన్ని ఏళ్లుగా జరుగుతున్న సెంటిమెంట్‌. ఈ సారి కూడా ఇదే సెంటిమెంట్‌ రిపీట్‌ అవ్వడంతో.. నిజమే కావచ్చు అంటూ నమ్మని వారు కూడా అనుమాన పడుతున్నారు. వాస్తవానికి 2011 నుంచి ఈ సెంటిమెంట్‌ నిజమవుతోంది. 2011లో భారత్‌, శ్రీలంక మధ్య జరిగిన వన్డే వరల్డ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ట్రోఫితో టీమిండియా కెప్టెన్‌ ధోని, శ్రీలంక కెప్టెన్‌ కుమార సంగార్కర ఫొటో దిగారు. ఆ ఫొటోలో ధోని ఎడమవైపు ఉన్నాడు. ఇక ఆ తర్వాత జరిగిన 2016 టీ20 వరల్డ్‌ కప్‌, 2015 వన్డే వరల్డ్‌ కప్‌, 2019 వన్డే వరల్డ్‌ కప్‌, 2017లో ఇండియా- పాకిస్తాన్‌ మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో, ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మొట్టమొదటి టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌లో విజయం సాధించిన జట్ల కెప్టెన్లు అందరూ.. కప్‌తో దిగిన ఫొటోలో లెఫ్ట్‌ సైడ్‌ నిలబడి ఉన్నారు.

Aus vs Nz Match ఇప్పుడు ఇదే సెంటిమెంట్‌ రిపీట్‌ అయింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ కూడా ట్రోఫికి ఎడమవైపు నిలబడ్డాడు. దీంతో ఇక ఈ టీ20 వరల్డ్‌ కప్‌ ఆస్ట్రేలియాదే అని సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ పోస్టులు చేశారు. ఇక టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో వారి నమ్మకం మరింత బలపడింది. వారి అంచనా ప్రకారం ఆస్ట్రేలియానే ఛాంపియన్‌గా నిలవడంతో వారి సెంటిమెంట్‌.. అని అనిపిస్తుంది. ఇక ఈ సారి ఎలాగైనా కప్‌ గెలవాలని భావించిన కివీస్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.

Aus vs Nz Matchఇప్పటి వరకు రెండు వన్డే ప్రపంచ కప్‌లు, ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో ఆ జట్టు కెప్టెన్లు ట్రోఫీకి కుడి నిలబడ్డారు. ఇదే వారి ఓటమికి కారణమని క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. కేన్‌ విలియమ్స్‌న్‌ సారథ్యంలో టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. మ్యాచ్‌కు ముందు కోహ్లీ, కేన్‌ ట్రోఫీతో ఫొటో దిగినప్పుడు మాత్రం ఎడమవైపు నిలబడ్డాడు. అలాగే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో, 2019 వరల్డ్‌ కప్‌లో మాత్రం కుడివైపు నిల్చున్నాడు. మరి ఈ సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.