బికిని వేసుకోలేదా? అయితే ఫైన్ కట్టాల్సిందే!

మన భారతీయ సంస్కృతి ప్రకారం మహిళా వస్త్రధరణలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. స్త్రీలు ఎక్కెడికెళ్ళిన కట్టు బొట్టు కచ్చితంగా ఉండాల్సిందే అని మన సంస్కృతిలో భాగమైపోయింది. ఇలా ఇదే సంస్కృతి సాంప్రదాయాలు ఆచరణలో పెడుతున్నారు మన మహిళలు. ఇంకో విషయం ఏంటంటే..మన అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు ధరించినా, లేక టీ షర్ట్ జీన్స్ ధరించినా నోటికి పని చెప్పి మందలిస్తారు వాళ్ల తల్లిదండ్రులు.

మరొక విషయం…మన స్కూళ్లల్లో కానీ మరి ఇంకెక్కడైనా యూనిఫామ్ వేసుకురాకుంటే ఫైన్ వెయ్యటం అనేది సర్వ సాధారణమైన అంశం. కానీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏంటంటే..యూరోపియన్ దేశంలో యూరోపియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించారు. ఇందులో నార్వేకు చెందిన ఓ మహిళా జట్టుకి బికిని వేసుకురాలేదని ఫైన్ విధించింది యూరోపియన్ ఫెడరేషన్. వినటానికి వింతగా ఉన్నా ఇదే నిజం.

without bikini fine in Norweign 01 minఇక వివరాల్లోకి వెళ్తే…యూరోపియన్ దేశంలోని బల్గెరియాలో నిర్వహించిన ఈ పోటీలకు అన్ని దేశాల నుంచి పాల్గొన్నాయి మహిళా జట్లు. ఈ పోటీలో నార్వే దేశం నుంచి మహిళా టీమ్ పాల్గొంది. కానీ వీరు బికినికి బదులుగా షార్ట్స్ వేసుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన యూరోపియన్ ఫెడరేషన్ వారికి ఫైన్ విధించింది. నిబంధనల ప్రకారం సరైన దుస్తువులు ధరించలేదని వీరికి ఒక్కొ ప్లేయర్ 150 యూరోలు చెల్లించాలని 1500 యూరోలు (రూ.1,31,665) ఫైన్ విధించి యూరోపియన్ ఫెడరేషన్.