క్రికెట్ కోసం ఆస్తులన్నీ వదులుకున్నాడు! డెవాన్ కాన్వే లైఫ్ స్టోరీ!

మన దేశంలో క్రికెట్ ని అభిమానించే వారికి కొదవ ఉండదు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు ఆటగాళ్లకి కూడా క్రికెట్ అంటే ప్రాణం. సచిన్, గంగూలీ, ద్రావిడ్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడో రిటైర్ అయిపోయారు. కానీ.., వీరంతా ఇండియన్ క్రికెట్ కోసం తమ జీవితాన్ని ఇంకా వెచ్చిస్తూనే ఉన్నారు. దీన్ని కేవలం డబ్బు కోసం చేసే పనిగా చూడలేము. క్రికెట్ అంటే వాళ్ళకి ప్రాణం. క్రికెట్ అంటే పిచ్చి. ఇలాంటి లెజండ్స్ ప్రపంచ క్రికెట్ లో చాలా మందే ఉన్నారు. కానీ.., ఓ కొత్త ఆటగాడు క్రికెట్ కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తే అతన్ని ఏమనాలి? ఉన్న ఆస్తులు అన్నీ క్రికెట్ ఆడటానికి వదిలేస్తే అతన్ని ఏమని పిలవాలి? వినడానికి ఇవన్నీ ఓ పిచ్చోడు చేసే పనులు అని అనుకోవచ్చు. కానీ.., ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెటర్ డెవాన్ కాన్వే ఇవన్నీ చేశాడు. తాజాగా మొదలైన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ తో డెవాన్ కాన్వే తన మొదటి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే కాన్వే డబుల్ సెంచరీ సాధించడంతో ఇప్పుడు క్రికెట్ లోకమంతా అతని గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి కాన్వే ఓ సౌత్ ఆఫ్రికన్ సిటిజన్. 2015 వరకు ఆ దేశం తరుపున డెమోస్టిక్స్ వరకు ఆడాడు కూడా. మంచి ఆటగాడిగా కూడా గుర్తింపు దక్కించుకున్నాడు. ఎలా అయినా సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్ లో స్థానం దక్కించుకోవాలని కలలు కన్నాడు. కానీ.., విధి రాత మరోలా ఉంది.

con 2అనుకోని కారణాలతో డెవాన్ కాన్వే కుటుంబం న్యూజిలాండ్ కి వలస పోవాల్సి వచ్చింది. దీంతో.., కాన్వే కలలకి ఫుల్ స్టాప్ పడిపోయింది. అతనికి అప్పటికే న్యూజిలాండ్ పౌరసత్వం ఉన్నా.., న్యూజిలాండ్ లో కొత్తగా క్రికెట్ ని స్టార్ట్ చేయడం అంటే మాటలు కాదు. క్లబ్ క్రికెటర్ గా మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టాలి. ఎన్నో కౌంటీలలో అద్భుతంగా రాణిస్తే తప్ప టీమ్ లో స్థానం దక్కడం అసాధ్యం. కానీ.., కాన్వే ఈ మార్గాన్నే ఎంచుకున్నాడు. క్రికెట్ ఆడుతూ.., మరో మార్గం లేక తన ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు. ఆఖరికి కార్ కూడా. ఇలా కొన్నేళ్ల పాటు ఓ అనాముకుడిగా న్యూజిలాండ్ లో క్లబ్ క్రికెట్ ఆడాడు. అక్కడ నుండి కౌంటీ లు. అక్కడ నుండి న్యూజిలాండ్ ఏ, బీ టీమ్స్ కి ప్రాతినిధ్యం వహించాడు. ఎక్కడ బ్యాట్ పట్టినా సెంచరీల మోత మోగించాడు. దీంతో.., సుమారు 5 ఏళ్ళ కష్టం తరువాత ఇప్పుడు కాన్వే కి ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో స్థానం లభించింది. తన మొదటి మ్యాచ్ లోనే లార్డ్స్ లో డబుల్ సెంచరీ సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక కాన్వే ఇప్పటికే న్యూజిలాండ్ వన్డే, ట్వంటీ ట్వంటీ జట్లలో కీలక సభ్యుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. సాధించాలన్న కసి, పట్టుదల ఉంటే.. ఎలాంటి పరిస్థితిల్లోనైనా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి కాన్వే జీవితమే ఓ ఉదాహరణ. మరి.., డెవాన్ కాన్వే రానున్న కాలంలో న్యూజిలాండ్ క్రికెట్ లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడా ? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.