ధనాధన్ క్రికెట్ ఐపీఎల్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మెగా సీజన్‌కు మరికొన్ని రోజులే ఉండడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఇప్పటికే సూరత్ చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ప్రాక్టీసులో ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడిన షాట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రాక్టీసులో భారీ షాట్లు ఆడిన ధోని ఏకంగా సింగిల్ హ్యాండ్‌తో సిక్సులు కూడా బాదాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ధోనిలో ఇంకా పస తగ్గలేదని అతని అభిమానులు ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. 26న జరగబోయే తొలి మ్యాచ్‌లో కూడా ధోని ఇలాంటి భారీ షాట్లు ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి కూడా ధోనినే చెన్నైకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో కెప్టెను మార్చని ఏకైక జట్టు చెన్నై సూపర్ కింగ్స్. మధ్యలో రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్నా కూడా ఆ తర్వాత కూడా ధోనినే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
ఇదీ చదవండి: పెదరాయుడిగా మారిన ధోని! IPLకు ముందే అవుట్..
ఇక గత ఏడాది ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీ గెలుచుకున్న చెన్నైసూపర్ కింగ్స్ ఈ సారి కూడా అదే జోరును కనబర్చాలని చూస్తోంది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 4 ట్రోఫీలు గెలుచున్న చెన్నై అత్యధిక కప్‌లు గెలిచిన జట్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఐదు ట్రోఫీలతో ముంబై ఇండియన్స్ తొలి స్థానంలో ఉంది. ధోని సారథ్యంలో 2022 సీజన్‌లో కూడా చెన్నై విజేతగా నిలుస్తుందని సీఎస్‌కే ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ధోని బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
That last six from Mahi 😍🔥 pic.twitter.com/j9puE06Lmp
— Sports Hustle (@SportsHustle3) March 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.