టీమిండియా 2011లో రెండో సారి వన్డే వరల్డ్ కప్ సాధించిందంటే అందులో ధోని, గంభీర కృషి చాలా ఉంది. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్లో సెహ్వాగ్, సచిన్, కోహ్లీ త్వరగా అవుట్ అయి పెవిలియన్ చేరినా.. పట్టువదల కుండా.. గౌతమ్ గంభీర్ 97 పరుగులతో ఛేజింగ్‌లో పిల్లర్‌లా నిలబడ్డాడు. అలాగే ధోని 91 పరుగులతో విజయాన్ని ఖాయం చేసి కప్పు చేతుల్లో పెట్టాడు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గంభీర్ కూడా చాలా సార్లు ధోనిపై విమర్శలు గుప్పించాడు. వరల్డ్ కప్ క్రెడిట్ అంతా ధోనికే ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే గంభీర్‌ను జట్టు నుంచి తొలగించడం వెనుక ధోని హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీనియర్ల అయిన సెహ్వాగ్, యువరాజ్‌సింగ్, గంభీర్ అలాంటి ప్లేయర్లకు సరైన ఫెయిర్‌వెల్ లేకుండా ధోని చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి.
మిగతా వాళ్లు పెద్దగా స్పందించకపోయినా.. గంభీర్ మాత్రం సందర్భమొచ్చిన ప్రతి సారీ ధోనిపై విమర్శలు చేసేవాడు. కానీ.. ఐపీఎల్ 2022 సందర్భంగా ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు పలకరించుకుని.. చాలా సేపు ముచ్చటించుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోర్ చేసినా.. లక్నో సూపర్ ఛేజింగ్‌తో గెలిచింది. మ్యాచ్ అనంతరం గంభీర్, ధోని చాలా సేపు సీరియస్‌గా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అయినా కూడా ఇద్దరికి టీమిండియా పరిస్థితి, భవిష్యత్తుపై ఒక విధమైన ఆలోచన విధానం ఉన్నట్లు సమాచారం.
ఆటగాళ్లుగా తమ మధ్య ఎలాంటి విభేదాలు ఉన్న.. జట్టు పరంగా వస్తే అంత ఒక్కటే అన్నట్లు కనిపించారు. 2011 తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీనికి కూడా గెలవలేదు. ధోని, గంభీర్ కూడా ఇదే విషయంపై చర్చించుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో టీమిండియా మెగా ఈవెంట్లలో మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ఏ విధంగా సంసిద్ధం అవ్వలానే విషయంలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో ధోని టీమిండియాకు మెంటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయినా కూడా జట్టు కనీసం సెమీస్ చేరలేదు. ఇలా పలు విషయాలపై గంభీర్, ధోని మాట్లాడుకున్నారని సమాచారం. మరి ఈ ఇద్దరు దిగ్గజాల సుదీర్ఘ సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ కారణంగా చాలా కష్టాలు పడ్డాను: గంభీర్
Convo between @MSDhoni & gambhir ❤
pic.twitter.com/QuABxIWFn5— Dhoni Army TN™ (@DhoniArmyTN) April 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.