క్రికెట్ ప్రపంచంలో ఆట, పరుగులు, రికార్డులు మాత్రమే కాదు.. ఎన్నో చిత్ర, విచిత్రాలు కూడా ఉంటాయి. వికెట్ తీసినప్పుడు విచిత్రంగా సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. అంతర్జాతీయ క్రికెట్ లోనూ బ్యాట్స్ మన్లు ఒక్కోసారి వింత వింత షాట్లు కొడుతుంటారు. గల్లీ క్రికెట్, టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ల విషయానికి వస్తే ఇంక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ వేసే బాల్, ఆడే షాట్ అన్నీ విచిత్రంగానే ఉంటాయి. ప్రస్తుతం ఒక కుర్రాడి బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలింగా, బుమ్రాలకు కూడా ఈ రేంజ్ బౌలింగ్ యాక్షన్ సాధ్యం కాదు అనడం అతిశయోక్తి కాదేమో.
కేరళ రాష్ట్రం మలప్పురంలో జరుగుతున్న ఓ క్రికెట్ మ్యాచ్ లో బౌలర్ వేసిన బంతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 17 జెర్సీతో ఉన్న ఆ కుర్రాడు చేతిని గుడ్రంగా తిప్పుతూ… స్పీడ్ గా వెళ్లి బాల్ వేశాడు. ఆ బాల్‌ను బ్యాట్స్ మన్ ఆడలేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు ఇలాంటి బౌలింగ్ యాక్షన్ చూడలేదురా బాబు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతను ఎవరు? అది గల్లీ క్రికెటా? ఏదైనా టోర్నమెంటా అనే వివరాలు తెలియరాలేదు. ఈ కుర్రాడి బాలింగ్ యాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.