టీమిండియా స్టార్ క్రికెట్ కుల్దీప్ యాదవ్ మరో టీమిండియా స్టార్ ప్లేయర్‌కు డిజిటల్ పేమెంట్ యాప్ పేటీయం ద్వారా డబ్బులు పంపాడు. స్టార్ క్రికెటర్లు, ఐపీఎల్‌లో మంచి ధర పలికిన క్రికెటర్లు కదా లావాదేవీలు లక్షలు, కోట్లలో ఉంటుదనుకోకండి. కుల్దీప్ పంపింది కేవలం రూ.4 మాత్రమే. ఇంతకీ కుల్దీప్ డబ్బులు పంపింది ఎవరీకో కాదు.. స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్‌కు. ఈ విషయాన్ని చాహల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. కుల్దీప్ నుంచి పైసలు వచ్చిన మెసేజ్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఏంటి విషయం కుల్దీప్.. మీరు కూడానా?’ అంటూ ట్వీట్ చేశాడు.
కాగా పేటీయంలో కొత్త యూజర్లు ఏవరికైనా రూ.4 పంపిస్తే తొలిసారి రూ.100 క్యాష్ బ్యాక్ పొందే ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ కోసమే కుల్దీప్ రూ.4 చాహల్‌కు పంపినట్లు తెలుస్తుంది. కాగా చాహల్ పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి కుల్దీప్, చాహల్‌కు రూ.4 పేటీయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rs. 100 Cashback se KulCha khaayenge 😅 https://t.co/SuN4HQP6j8
— Kuldeep yadav (@imkuldeep18) February 18, 2022