పంజాబ్ టీమ్ కి కే.ఎల్. రాహుల్ షాక్! టీమ్ కి గుడ్ బై!

ఐపీఎల్‌ 14 ముగిసిందో లేదో.. అప్పుడే ఐపీఎల్‌ 2022 న్యూస్‌ అప్‌ డేట్స్‌ క్రికెట్‌ లవర్స్‌ చాలా బిజీగా ఉంటున్నారు. మెగా ఆక్షన్‌ దగ్గర పడుతుండటంతో చాలా అప్‌ డేట్స్‌, గాసిప్స్‌ వస్తున్నాయి. ఇది గాసిప్‌ అయ్యే ఛాన్సే లేదు.. కచ్చితంగా జరిగి తీరుతుందని కొందరు చెప్తున్నారు. అదేంటంటే కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ కు గుడ్‌ బై చెప్పేస్తున్నాడు. వచ్చే ఐపీఎల్‌ కు మెగా ఆక్షన్‌ లో తాను కూడా ఉండబోతున్నాడు అని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పంజాబ్‌ టీమ్ యాజమాన్యం విషయంలో ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పంజాబ్‌ కింగ్స్‌ కు గుడ్‌ బై చెప్తున్నట్లు సమాచారం.

KL Rahul in New IPL Team 2022 - Suman TVలక్నో కెప్టెన్‌ గా..

ఈసారి సీజన్‌ నుంచి రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో ఈ మెగా ఆక్షన్‌ ఎంతో ఉత్కంఠగా మారనున్న మాట వాస్తవమే. కేఎల్‌ రాహుల్‌ విషయంలో లక్నో టీమ్‌ యాజమాన్యం ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా అతడిని దక్కించుకుని ఆ టీమ్‌ కెప్టెన్‌ గా చేయనున్నట్లు సమాచారం. కొత్త ఫ్రాంచైజీలకు ఒక అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆక్షన్‌ కంటే ముందే తాము కోరుకుంటున్న ఇద్దరు లేదా ముగ్గురు ప్లేయర్లను దక్కించుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆక్షన్‌ కు వెల్లకుండానే కేఎల్‌ రాహుల్‌ ను దక్కించుకోవాలని లక్నో ఫ్రాంచైజీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పంజాబ్‌ టీమ్ ఒక స్టార్‌ కెప్టెన్‌ ను కోల్పోయినట్లే. గత సీజన్‌ లో కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శన ఆధారంగా అతను భారీగానే దక్కించుకునే అవకాశం ఉంది. ఒకవేళ లక్నో టీమ్‌ ముందే దక్కించుకున్నా కూడా రిటైన్‌ చేసుకున్న ప్లేయర్లకు ఇచ్చిన మాదిరిగానే భారీగా ముట్టజెప్పాల్సి ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌ జట్టు మారే అవకాశాలు ఉన్నాయా? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.