శిఖర్ ధావన్.. గత 7 ఏళ్లుగా ఇండియా క్రికెట్ జట్టులో పర్మినెంట్ ప్లేయర్. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో గబ్బర్ రికార్డ్ అద్భుతంగా ఉంది. పైగా.., ఐసీసీ ట్రోఫీలలో ధావన్ యావరేజ్.. కోహ్లీ కన్నా ఎక్కువ. వీటన్నిటికీ తోడు.. 2021 ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ధావనే. టీ-20 వరల్డ్ కప్ జట్టులోకి సెలక్ట్ అవ్వడానికి ఇంతకన్నా అర్హతలు ఇంకేం కావాలి? కానీ.., ఈసారి టీ-20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో శిఖర్ ధావన్ కి జట్టులో స్థానం దక్కలేదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే.. రిజర్వ్ ఆటగాడిగా కూడా ధావన్ ని పరిగణంలోకి తీసుకోలేదు. నిన్న మొన్నటి వరకు టీమ్ లో కీలక సభ్యుడైన శిఖర్ ధావన్ పై.. సెలక్టర్స్ ఒక్కసారిగా ఇంత అనాశక్తి ఎందుకు చూపించారు? దీని అంతటికి కారణం కోహ్లీనా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో లేడు. ఇలాంటప్పుడు వన్ డౌన్ లో కోహ్లీ బ్యాటింగ్ కి వస్తుంటే.. బాల్ టూ బాల్ సింగిల్స్ మాత్రమే ఆడుతున్నాడు. దీని కారణంగా తరువాత.. స్లాగ్ ఓవర్స్ లో క్రీజ్ లోకి వచ్చే బ్యాట్స్మెన్స్ పై ప్రెజర్ పెరిగిపోతోంది. దీంతో.. ఆ స్లో రన్ రేట్ ని తప్పించడానికి గత కొంత కాలంగా కోహ్లీ టీ-20 లలో ఓపెనర్ అవతారం ఎత్తాడు. పవర్ ప్లే లో కోహ్లీ స్ట్రోక్స్ ఫోర్స్ గా మారుతుండటంతో టీమ్ పై ప్రెజర్ తగ్గింది. అయితే.., ఇప్పుడు టీ-20 వరల్డ్ కప్ కి కూడా కోహ్లీ ఇదే స్ట్రాటజీతో ముందుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడట.
తాను ఓపెనర్ గానే కొనసాగాలని కోహ్లీ డిసైడ్ అవ్వడంతో.. ధావన్ కి జట్టులో స్థానం లేకుండా పోయిందన్న టాక్ వినిపిస్తోంది. పైగా.., కేఎల్. రాహుల్ టచ్ లో ఉండటం కూడా ధావన్ కి శాపంగా మారింది. పోనీ.. బ్యాకప్ ఓపెనర్ గా.., రిజర్వ్ ఆటగాడిగానైనా తీసుకుందాం ఆ స్థానంలో ఇషాన్ కిషన్ వచ్చి చేరాడు.
కీపింగ్ తో పాటు.., ఓపెనర్ గా కూడా బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం కిషన్ కి కలసి వచ్చింది. ఇలా టీమ్ లో నుండి ఎవ్వరిని తొలగించలేక, కోహ్లీని కాదని శిఖర్ ధావన్ ని ఓపెనింగ్ ఆడించలేక సెలక్టర్స్ గబ్బర్ పై వేటు వేసినట్టు తెలుస్తోంది. మరి.. టీ-20 వరల్డ్ కప్ జట్టులోకి శిఖర్ ధావన్ ని ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.