ఐపీఎల్ 2022లో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య లోస్కోర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. కానీ ఒక దశలో కేకేఆర్ మ్యాచ్‌ను తమ చేజేతులా పొగొట్టుకుంది. బెంగళూరుకు తక్కువ టార్గెట్ ఇచ్చినా.. కేకేఆర్ బౌలర్లు మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకూ తీసుకొచ్చారు. కానీ చివర్లో ఆ జట్టు ఆటగాడు ఉమేష్ యాదవ్ చేసిన ఒక్క తప్పు కేకేఆర్ కొంపముంచింది. 129 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. బెంగళూరు గెలవాలంటే 18 బంతులకు 24 చేయాల్సిన ఉంది. ఈ సమయంలో 18 ఓవర్ వేసిన టిమ్ సౌతీ కేవలం ఏడు పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ ఒక్కసారిగా కోల్‌కతా వైపు టర్న్ అయింది.
దీంతో కీలకమైన 19వ ఓవర్‌ను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. వెంకటేశ్ అయ్యర్‌కి ఇచ్చాడు. రెండు ఓవర్లలో 17 పరుగులు చేయాల్సిన సమయంలో 19వ ఓవర్ ఫస్ట్ బాల్‌ను హర్షల్ పటేల్ సింగల్ తీసి దినేష్ కార్తీక్‌కు బ్యాటింగ్ ఇచ్చాడు. రెండో బాల్‌ను కార్తీక్ స్క్వయర్ కట్‌లోకి తోయడంతో అది నేరుగా ఫీల్డర్ ఉమేష్ యాదవ్ దగ్గరికి వెళ్లింది. గమనించిన కార్తీక్ వెంటనే క్రీజ్‌లోకి వచ్చేశాడు. అయితే, అప్పటికే హర్షల్ పటేల్ కూడా స్ట్రైకింగ్ ఎండ్‌కు రావడంతో ఇద్దరు బ్యాటర్లు ఒకే వైపునకు చేరుకున్నారు. ఉమేష్ యాదవ్ బంతిని వెంటనే కీపర్ వైపు విసిరాడు. ఆ సమయంలో కీపర్ వికెట్ల దగ్గర లేకపోవడంతో కోల్‌కతా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.
ఉమేశ్ ఆ బంతిని బౌలింగ్ ఎండ్‌లో ఉన్న వెంకటేశ్ అయ్యర్ వైపు విసురుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. రనౌట్ మిస్సయిన తర్వాత బంతినే హర్షల్ పటేల్ కీపర్ వెనుక నుంచి ఫోర్‌గా మళ్లించాడు. చివరి బంతిని భారీ షాట్ కొట్టడంతో లాంగ్ ఆన్‌లో ఫోర్ వెళ్లింది. దాంతో బెంగళూరు విజయం దాదాపు ఖరారైంది. ఇక చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం ఉండటంతో.. రసెల్ వేసిన మొదటి బంతినే దినేష్ కార్తీక్ లెగ్ సైడ్‌లో సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని స్ట్రెయిట్ ఫోర్‌గా కొట్టడంతో విజయం బెంగళూరు వశమైంది. మ్యాచ్ ఓడినందుకన్న.. 19వ ఓవర్లో వచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నందుకే కేకేఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఫీలు అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPLలో పూరన్ పూర్ ప్రదర్శన! అంతా తెలిసి కావ్య పాప ఆ తప్పు ఎందుకు చేసింది?
So, if umesh yadav would not have missed that run out of dinesh kartik #RCB would have lost today. Technically its #KKR who won the match . #RCBvsKKR
— kartik supolia (@rimpu_says) March 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.