టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ ప్రపంచానికి ఒక కొత్త షాట్‌ను పరిచయం చేశాడు. దాని పేరే ది హెలికాప్టర్ షాట్. కచ్చితమైన యార్కర్ బంతులను కూడా సిక్సులుగా మార్చే ఆ షాట్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ షాట్ అందరూ ఆడలేరు. కొందరు మాత్రమే ఆడే ధైర్యం చేస్తారు. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా హెలికాప్టర్ షాట్ కొట్టాడు.
ఆవేష్ ఖాన్ వేసిన 19వ ఓవర్ మూడో బంతిని రిషభ్ పంత్ అద్భుతంగా హెలికాప్టర్ షాట్ కొట్టాడు. హెలికాప్టర్ షాట్‌తో ఆ బంతిని డీప్ మిడ్-వికెట్ మీదుగా పంత్ ఫోర్ బాదాడు. పంత్ కొట్టిన ఈ హెలికాప్టర్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని లక్నో.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీలో ఓపెనర్ పృథ్వీ షా(61 రన్స్.. 9 ఫోర్లు, 2 సిక్సులు), లక్నోలో క్వింటన్ డికాక్ 52 బంతుల్లో 80 పరుగులు చేసి రాణించారు. మరి పంత్ హెలికాప్టర్ షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పరుగులు ఇవ్వడంలో తగ్గేదేలే! ముగ్గురూ ముగ్గురే..!
The helicopter shot – Rishabh Pant ft.
📸: Disney+Hotstar VIP#DCvRCB #DC #RCB #IPL #IPL2021 #CricTracker pic.twitter.com/ZxkSorSCtH
— CricTracker (@Cricketracker) April 27, 2021
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.