ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ అద్బుత ప్రదర్శన కనబరుస్తుంది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే.. జీటీ అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఐపీఎల్ మెగా వేలం తర్వాత అత్యంత బలహీనమైన జట్టుగా కనిపించిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు నంబర్‌వన్ టీమ్‌గా ఉంది. ఈ జట్టు ఇంత విజయవంతం అవ్వడానికి బౌలింగ్ ఒక ప్రధాన కారణం అయితే.. ఇంకొటి మ్యాచ్‌ను ఫినిష్ చేసే ఆటగాళ్లు ఉండడం.. వాళ్లు ఫామ్‌లో ఉండటం జీటీకి కలిసొస్తున్న అంశం. అందులోనూ ముఖ్యంగా రాహుల్ తెవాటియా అయితే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే గుజరాత్‌కు మూడు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు.
ఏదో ఒక సారి అలా ఆడితే.. లక్ అనుకోవచ్చు.. కానీ అతను థ్రిల్లింగ్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించి మరి పరుగులు రాబడుతున్నాడు. పైగా అసాధ్యం అనుకున్న ప్రతిసారి చేసి చూపిస్తున్నాడు. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైనా, 5 ఓవర్లలో 50పై చిలుకు పరుగులు అవసరమైనా దానికి తగ్గట్లు బ్యాటింగ్ చేస్తున్నాడు. భారీ సిక్సులే కాదు.. టైమింగ్‌తో కూడిన ఫోర్లు కొడుతున్నాడు. దీంతో రాహుల్ తెవాటియా గుజరాత్ టైటాన్స్‌కు ప్రధాన అసెట్‌గా మారాడు. రాహుల్ తెవాటియా క్రీజ్‌లో ఉంటే ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా.. సాధ్యమే అనిపించేలా ఆడుతున్నాడు. దీంతో అతన్ని రాబోయే టీ20 వరల్డ్ కప్ టీమిండియాలోకి తీసుకునేందుకు బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
మ్యాచ్ చివర్లో భారీగా పరుగులు రాబట్టడంతో పాటు స్పిన్ బౌలింగ్‌తో జట్టుకు ఆల్‌రౌండర్‌గా కూడా పనికి వస్తాడు. ప్రస్తుతం టీమిండియా డెత్ ఓవర్స్‌లో బ్యాటింగ్ చేసి హార్డ్ హిట్టింగ్‌తో మ్యాచ్ గెలిపించే బ్యాటర్ కనిపించడం లేదు. ఇన్ని రోజులు టీమిండియా ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్థిక్ పాండ్యా మూడో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నాడు. పైగా బౌలింగ్ కూడా పెద్దగా చేయడం లేదు. ఇక హార్థిక్ స్థానంలో టీమిండియాలోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో రాహుల్ తెవాటియాకు అవకాశం రావచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతో కన్నీళ్లు పెట్టుకున్న భార్య రితిక
The ‘ice-man’ opens up on his consistent match-winning finishes for Gujarat Titanshttps://t.co/FzSzTw5JyD
— HT Sports (@HTSportsNews) May 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.