ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆల్‌రౌండర్ రస్సెల్ వీరవిహారం చేశాడు. అతని దెబ్బకు 138 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.3 ఓవర్లలోనే ఛేదించింది కేకేఆర్. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు రస్సెల్. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ అతని వద్దే ఉంది. కాగా ఈ మ్యాచ్లో ఒక ఆసక్తి కరమైన సంఘటన చోటు చేసుకుంది. అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగవ బంతిని రస్సెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. రస్సెల్ బ్యాట్‌కు తాకిన బంతి బుల్లెట్ కంటే వేగంగా బౌలర్‌పైకి దూసుకెళ్లింది.
బౌలర్ అర్షదీప్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వెనకాలే ఉన్న అంపైర్ కూడా రెప్పపాటులో కిందకి వంగాడు. అదృష్టవశాత్తు బంతి ఇద్దరికి చాలా దగ్గరి నుంచి బౌండరీ లౌన్‌కు దూసుకెళ్లింది. రస్సెల్ షాట్‌కు బిత్తరపోయిన అంపైర్.. కొంచెం చూస్కొని కొట్టు బాబు.. అన్నట్లు చేయి చూపిస్తు సైగ చేశాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన రస్సెల్ వంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. 138 పరుగలు లక్ష్యంలో సగం పరుగుల అతనొక్కడే చేశాడు. మరి రస్సెల్ షాట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: SRH టీమ్ పై రాజస్థాన్ రాయల్స్ సెటైరికల్ పోస్ట్!
Best snapshots from a stunning win last night 📸#KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/TuMCig8URQ
— KolkataKnightRiders (@KKRiders) April 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.