ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు లీగ్‌లో శుభారంభం అందించాడు. 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌లో భారీ షాట్లు ఆడుతున్న రోహిత్ శర్మకి తన వేరియేషన్‌తో కళ్లెం వేసిన కుల్దీప్ యాదవ్.. ప్రమాదరక హిట్టర్ కీరన్ పొలార్డ్‌ని తన టర్న్‌తో అతను క్రీజులో కుదురుకోకుండానే బోల్తా కొట్టించేశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టీమ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. కుల్దీప్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
నిజానికి కుల్దీప్ యాదవ్ గత మూడేళ్లుగా ఐపీఎల్‌లో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నాడు. 2019 ఐపీఎల్ సీజన్‌లో మొయిన్ అలీ తన బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టడంతో.. ఆత్వవిశ్వాసం కోల్పోయిన కుల్దీప్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. బెంగళూరుతో జరిగిన ఆ మ్యాచ్‌లో కోల్‌కత్తాకి ఆడిన కుల్దీప్.. 4 ఓవర్లలో వికెట్ లేకుండా 59 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక అక్కడి నుంచి కేకేఆర్ కుల్దీప్‌ను పక్కన పెట్టేస్తూ వచ్చింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే కుల్దీప్ యాదవ్‌ని ఆడించిన కోల్‌కతా.. ఐపీఎల్ 2021 సీజన్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు.
ఆ ప్రభావం అతని అంతర్జాతీయ కెరీర్‌పై పడి భారత్ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ.. ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో రూ.2 కోట్లకు కుల్దీప్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదటి మ్యాచ్‌లోనే అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని రెండుజేతులతో పట్టుకున్న కుల్దీప్.. తన సత్తాచాటి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మ్యాచ్‌లో బంతిని గింగిరాలు తిప్పిన కుల్దీప్ యాదవ్.. మునుపటి లయతో చక్కగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్ అనంతరం కుల్దీప్ కంట ఆనందభాష్పాలు వచ్చాయి. 2019 సీజన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న కుల్దీప్.. ఇప్పుడు ఆనందభాష్పాలతో ఆ బాధను కడిగేసుకున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా స్టార్ క్రికెటర్‌కు పేటీయం ద్వారా డబ్బులు పంపిన కుల్దీప్ యాదవ్
Upstox Most Valuable Asset of the Match between @DelhiCapitals and @mipaltan is Kuldeep Yadav.@Upstox #TATAIPL #OwnYourFuture #DCvMI pic.twitter.com/GGK3WXhEhP
— IndianPremierLeague (@IPL) March 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.