ఐపీఎల్ 2022లో బుధవారం కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ విధ్వంసంతో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే 56 పరుగుల చేశాడు కమిన్స్. ముంబై బౌలర్ డేనియల్ సామ్స్.. వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో అయితే ఏకంగా 35 పరుగుల రాబట్టాడు. దీంతో ఆ ఓవర్‌లోనే మ్యాచ్ ముగిసిపోయింది. సూపర్ బ్యాటింగ్ ముంబై చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను లాక్కుని కేకేఆర్‌ను గెలిపించిన కమిన్స్‌పై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2022లో కమిన్స్‌కు ఇదే తొలి మ్యాచ్.. ఈ మ్యాచ్‌కు ముందు కమిన్స్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. పదేపదే అవుట్ అయ్యాడని, కానీ మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపించాడంటూ కొనియాడాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కమిన్స్ బ్యాటింగ్ చూస్తే.. జట్టులో చోటు ఇవ్వాలా వద్దా? అనే ఆలోచన శ్రేయస్‌కు వచ్చినట్లు అతని వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. మ్యాచ్‌కు ముందు కమిన్స్‌పై ఏ మాత్రం ఆశలు పెట్టుకోని శ్రేయస్.. మ్యాచ్ అనంతరం అతని బ్యాటింగ్‌కు ఆశ్యర్యపోయినట్లు తెలుస్తుంది. మరి కమిన్స్ బ్యాటింగ్, శ్రేయస్ రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఓటమితో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ!
— Sayyad Nag Pasha (@PashaNag) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.