SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Fans Demanding For Best Celebration Award To Virat Kohli

Virat Kohli: IPL 2022లో ఆ ప్రత్యేకమైన అవార్డును విరాట్‌ కోహ్లీకి ఇవ్వాల్సిందేనా?

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 26 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Virat Kohli: IPL 2022లో ఆ ప్రత్యేకమైన అవార్డును విరాట్‌ కోహ్లీకి ఇవ్వాల్సిందేనా?

ఐపీఎల్‌ 2022లో ఏకైక ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. లీగ్‌ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, నాలుగో స్థానంలో నిలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు క్వాలిఫైయర్‌ 2లో ఆడేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సూపర్‌ విక్టరీని సాధించి.. రాజస్థాన్‌ రాయల్స్‌తో క్వాలిఫైయర్‌ 2లో పోటీపడనుంది. కాగా ఈ మ్యాచ్‌ తర్వాత ఐపీఎల్‌లో ఒక ప్రత్యేకమైన అవార్డును ప్రవేశపెట్టి.. అది కచ్చితంగా విరాట్‌ కోహ్లీకే ఇవ్వాలనే డిమాండ్‌ సోషల్‌ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యక్తం అవుతుంది. అదే బెస్ట్‌ సెలబ్రేషన్‌ అవార్డు.

గ్రౌండ్‌లో విరాట్‌ కోహ్లీ ఎంత ఎనర్జీటిక్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమ్‌లో ఏ బౌలర్‌ వికెట్‌ తీసినా, ఏ బ్యాటర్‌ అద్భుతమైన షాట్‌ ఆడినా కోహ్లీ ఎంతో ఆనందపడిపోతుంటాడు. ఇన్‌ప్యాక్ట్‌ వాళ్ల కంటే కూడా ఎక్కువ సంబురాలు చేసుకుంటాడు. మైదానంలో కోహ్లీ అంత అగ్రెసివ్‌గా ఉండటం జట్టులో ఎంతో స్ఫూర్తి, ఉత్సహం నింపుతుంది. విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యుత్తుమ ఆటగాడు. అలాంటి ప్లేయర్ అయిన కోహ్లీ.. ఇతరుల విజయాలను కూడా ఎంతో హుందా, నిష్కల్మశంగా అభినందిస్తాడు, ఆస్వాదిస్తాడు. జట్టుకు మేలు జరిగితే చాలా కోహ్లీ కంటే ఎక్కువ సంతోషించే ప్లేయర్‌ ఇంకొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్‌ను కోహ్లీ అంతలా ప్రేమిస్తాడు. అందుకే తన జట్టు నుంచి ఏ ప్లేయర్‌ మంచి ప్రదర్శన కనబర్చిన కోహ్లీ ఆనందంతో ఉబ్బితబ్బిపోతాడు. గెలవాలనే కసి.. కోహ్లీని అంత అగ్రెసివ్‌గా ఉంచుతోంది.

 Virat Kohli deserves award!

బుధవారం లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో తన ఓపెనింగ్‌ పార్టనర్‌ డుప్లెసిస్‌ త్వరగా అవుట్‌ అవ్వడంతో కొంచెం ఆచీతూచి ఆడిన కోహ్లీ.. కొత్త కుర్రాడు, ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ రజత్‌ పటీదార్‌ మంచి టచ్‌లో కనిపించి, షాట్లు ఆడుతుండడంతో సింగిల్స్‌ తీసి అతనికి స్ట్రైకింగ్‌ ఇస్తూ సపోర్టింగ్‌ రోల్‌ ప్లే చేశాడు. ఒక సీనియర్ ప్లేయర్‌ అయి ఉండి కూడా ఇంత నిస్వార్థంగా వ్యవహరించాడు. పైగా పటీదార్‌ షాట్లు కొడుతుంటే తానే కొట్టినట్లు సెలబ్రేట్‌ చేసుకుంటూ, పటీదార్‌ను అభినందిస్తూ కనిపించాడు. అలాగే తను అవుట్‌ అయి డగౌట్‌లో కూర్చున్నా.. ప్రతి షాట్‌కు లేచి నించుని మరీ తమ బ్యాటర్లను ఉత్సాహపరిచాడు. అలాగే మ్యాచ్‌ గెలిచిన తర్వాత.. కొన్ని అడుగులు గాల్లో పైకి దూకుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ కోహ్లీ ఫ్యాన్స్‌ అతనికి బెస్ట్‌ సెలబ్రేషన్‌ అవార్డు ఇవ్వాలని సరదాగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ చేసింది. మొహ్‌సిన్‌ ఖాన్‌ ఆర్సీబీని తొలి ఓవర్‌లోనే దారుణంగా దెబ్బతిశాడు. ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌(0)ను తొలి ఓవర్‌ ఐదో బంతికి అవుట్‌ చేసి.. టాస్‌ గెలిచి ఫీల్డిండ్‌ ఎంచుకున్న తన కెప్టెన్‌ నిర్ణయం సరైందే అని నిరూపించాడు. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ, రజత్‌ పటీదార్‌ ఇన్సింగ్స్‌ను కొనసాగించాడు. కోహ్లీ నెమ్మదిగానే ఆడినా.. పటీదార్‌ మాత్రం ఎటాకింగ్‌ ప్లేతో లక్నో బౌలర్లకు చూక్కలు చూపించాడు. పటీదార్‌ 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి అదరగొట్టాడు. దినేష్‌ కార్తీక్‌ 23 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్‌ 37 పరుగులు చేసి రాణించడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. లక్నో బౌలర్లలో మొహ్‌సిన్‌ ఖాన్‌, ఆవేశ్‌ ఖాన్‌, కృనాల్‌ పాండ్యా, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

 Virat Kohli deserves award!

208 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నోను ఆర్సీబీ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న క్వింటన్‌ డికాక్‌(6)ను తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేశాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 79 పరుగులు, దీపక్‌ హుడా 26 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్సులతో 45 పరుగులు చేసి రాణించారు కానీ.. లక్నోకు విజయ తీరాలకు చేర్చలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్లు 193 పరుగులు చేసి 14 రన్స్‌ తేడాతో ఓడింది. ఆర్సీబీ బౌలర్లలో హెజల్‌వుట్‌ 3, సిరాజ్‌, హసరంగా, హర్షల్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీశారు. మరి ఈ కోహ్లీకి బెస్ట్‌ సెలబ్రేషన్‌ అవార్డు ఇవ్వాలనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: లక్నోతో మ్యాచ్‌ తర్వాత గ్రౌండ్‌లోనే ప్రార్థన చేసి.. దేవుడికి థ్యాంక్స్‌ చెప్పిన కోహ్లీ

The winning celebration from Virat Kohli. The trademark jump. #Aakashvani #ViratKohli #ViratKohli𓃵 #RajatPatidar #RCB #RCBvLSG pic.twitter.com/3nBpyKO5W3

— 𝐀𝐓𝐀𝐋 𝐂𝐇𝐎𝐔𝐁𝐄𝐘 (@UjjwalC14572900) May 26, 2022

#RajatPatidar smashes century, #ViratKohli, RCB players give him standing ovation, see pics#RCBvsLSG | #IPL2022https://t.co/un7FFO8mM8

— DNA (@dna) May 25, 2022

Virat Kohli and the whole RCB dugout reaction when Rajat Patidar reached his century. pic.twitter.com/8dot5rsNwV

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 25, 2022

Tags :

  • Best Celebration Award
  • ipl 2022
  • RCB vs LSG
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam