కివీస్‌తో రేపే తొలి టీ20! టీమిండియా కోచ్‌గా ద్రావిడ్‌కు ఫస్ట్‌ మ్యాచ్‌

Team India Coach Rahul Dravid Starts Net Practice - Suman TV

ఇటివల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. బుధవారం జైపూర్‌లో రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు చాలా ప్రత్యేకం. టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌ శర్మకు బీసీసీఐ కెప్టెన్‌ పగ్గాలు అందించింది. ఒక క్రికెట్‌ దిగ్గజం, ది వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ హెచ్‌ కోచ్‌గా టీమిండియా మొదటి మ్యాచ్‌ ఆడబోతుంది.

దీంతో ఈ మ్యాచ్‌ తొలి ప్రత్యేకతను సంతరించుకుంది. రేపు జరగబోయే మ్యాచ్‌లో విజయం సాధించి హెచ్‌గా ద్రావిడ్‌, కెప్టెన్‌గా రోహిత్‌ తమ ప్రస్థానాన్ని గ్రాండ్‌గా ప్రారంభించాలని ఇండియన్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. మొదటి సారి రాహుల్‌ ద్రావిడ్‌ టీమిండియా ఆటగాళ్లకు కోచింగ్‌ ఇస్తున్న వీడియోను బీసీసీఐ రిలీజ్‌ చేసింది. కొత్త బాధ్యతలు, కొత్త సవాళ్లు, కొత్త ఆరంభాలు అంటూ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Team India Coach Rahul Dravid Starts Net Practice - Suman TVఈ వీడియో ద్రావిడ్‌ రోహిత్‌ శర్మకు బంతి విసిరి ప్రాక్టీస్‌ చేయిస్తున్నాడు. యాదృశ్చికంగా రోహిత్‌ శర్మ టీమిండియా తరపున అరంగ్రేటం చేసిన సమయంలో రాహుల్‌ ద్రావిడ్‌ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు రోహిత్‌ శర్మ టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో ద్రావిడ్‌ టీమిండియా హెచ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇక న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత్‌ జట్టు ఈ విధంగా ఉండొచ్చు.

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, అశ్విన్‌, అక్షర్ పటేల్‌, హర్షల్‌పటేల్‌, సిరాజ్‌, దీపక్‌ చాహర్‌(అంచనా)