దీపక్‌ చాహర్‌ మెస్మరైజింగ్‌ బ్యాటిం‌గ్‌.. రాహుల్‌- రోహిత్‌ ఫిదా..

Deepak Chahar Rohith sharma

పే టీఎం టీ20 సిరీస్‌ ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేసి ఛాంపియన్స్‌ గా నిలిచింది. టాపార్డర్‌ లో రోహిత్‌ వేసిన బేస్‌ ను తర్వాతి బ్యాట్స్‌ మన్లు వినియోగించుకోలేక పోయారు. రోహిత్‌ తర్వాత గేమ్‌ కొంత స్లాగ్‌ అయ్యింది. వికెట్‌ కూడా త్వరగానే కోల్పోయింది. కాస్త ఫామ్‌ లో కనిపించిన హర్షల్‌ పటేల్‌ హిట్‌ వికెట్‌ గా వెనుదిరిగాడు. అప్పటికే గౌరవ ప్రదమైన స్కోర్‌ ఉంది. కానీ, భారీ స్కోర్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ, తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన దీపక్‌ చాహర్‌ అంచనాలను మార్చేశాడు. మిల్నే వేసిన ఆఖరి ఓవర్‌ లో స్కోర్‌ బోర్డుకు 19 పరుగులు జతచేశాడు.

రోహిత్ సెల్యూట్‌..

దీపక్‌ చాహర్‌ 18.5, 18.6 బంతులను చాలా ఫన్నీగా ఆడాడు. మిల్నే వేసిన ఆఖరి ఓవర్‌ లో దీపక్ చాహర్ విరుచుకుపడ్డాడు. మొదటి రెండు బంతులు బౌండిరీలుగా మార్చాడు. తర్వాతి బంతికి ఈజీగా 2 పరుగులు చేశారు. నాలుగో బంతిని భారీ సిక్సుగా మార్చాడు. అందరూ అవాక్కాయ్యారు… రోహిత్‌ సైతం దీపక్‌ చాహర్‌ బ్యాటింగ్‌ చూసి మురిసిపోయాడు. ఆ సిక్సరు బాదిన తర్వాత రోహిత్‌ శర్మ సెల్యూట్‌ చేస్తూ కనిపించాడు. దీపక్‌ ఆడిన ప్రతి బాల్‌ ను మొత్తం టీమిండియా ఆశ్వాదించింది. ప్రేక్షకులు సైతం ప్రతి బాల్‌ కు చీర్‌ చేస్తూ కనిపించారు. దీపక్‌ చాహర్‌ 8 బంతుల్లో 21 పరుగులు చేసి.. స్కోర్‌ బోర్డును 184కు చేర్చాడు.