ఆస్ట్రేలియా క్రికెటర్ హెల్మెట్ కు తగిలిన బాల్.. షాకింగ్ విజువల్స్..

marshcup

క్రికెట్ లో బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ తో పాటు.. స్లెడ్జింగ్‌ కూడా కామనే. బ్యాట్సమన్‌ పాతుకుపోయినప్పుడు అతడ్ని రెచ్చగొట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఆటపట్టించేవిగా ఉండగా కొన్ని ప్రమాదకరంగా మారుతాయి. ఒక్కోసారి సంయమనం కోల్పోయిన బౌలర్‌ బౌన్సర్‌లు, షార్ట్‌ పిచ్‌ లు బాల్స్‌ వేయడం సహజం. అవి ఒక్కోసారి బ్యాట్స్‌ మన్‌ శరీరాన్ని తాకుతుంటాయి. అలా జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్‌ లో జరిగింది ఈ ఘటన. బౌలర్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బాల్‌ కు బ్యాట్స్‌ మన్‌ హెల్మెట్‌ ఎగిరిపడింది.

వివరాల్లోకి వెళ్తే.. మార్ష్‌ కప్ లో భాగంగా క్వీన్స్ లాండ్ బుల్స్, వెస్టర్న్ ఆస్ర్టేలియా జట్లు ఓ వన్డే మ్యాచ్ లో తలపడ్డాయి. క్వీన్స్ లాండ్ ఇన్నింగ్స్ 28వ  ఓవర్లో… బ్యాట్స్ మన్ జిమ్మీ పీర్సన్ బ్యాటింగ్ చేస్తుండగా కామెరూన్ బౌలింగ్ కి వచ్చాడు. అతడు వేసిన ఓ షార్ట్ పిచ్ బంతి జిమ్మీ హెల్మెట్ కు బలంగా తాకడంతో ఎగిరి కింద పడింది. హెల్మెట్‌ ఎగిరి పడటం చూసిన ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఫీల్డర్లు వెంటనే తేరుకొని జిమ్మీ వద్దకు వచ్చి పరిస్థితి అడిగి తెలుకున్నారు. ఆ జట్టు వైద్యుడు పరీక్షించి ప్రమాదం ఏమీ లేదని తెలిపాడు. అనంతరం ఆటను  కొనసాగించిన జిమ్మీ 50 బంతుల్లో 62 పరుగులు చేశాడు. జిమ్మీ అద్భుత బ్యాటింగ్‌ వృథా అయ్యింది. ఈ  మ్యాచ్ లో క్వీన్స్ లాండ్ 70 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌ ఫలితం గురించి పక్కన బెడితే జిమ్మీ సేఫ్‌ గా ఉండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.