టీ-ట్వంటీ వరల్డ్ కప్:  పాకిస్థాన్ ఫ్యాన్ కి  టీమిండియా అభిమాని ఝలక్!

cricket ad

‘ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌’ ఫీవర్‌ మొదలైంది. టీమిండియా తుదిజాబితా ప్రకటించడం, టీ20 ప్రపంచకప్‌ జెర్సీని ఆవిష్కరించడం చకాచకా జరిగిపోయాయి. దానికి తోడు దాదాపు రెండేళ్ల తర్వాత అక్టోబరు 24న పాకిస్థాన్‌తో తలపడనుంది. మామూలుగా ప్రపంచకప్‌ అనగానే టీమిండియా, పాకిస్థాన్‌ అభిమానులతో ఫన్నీ యాడ్స్‌ వస్తుంటాయి. ఈసారి కూడా ‘మౌకా మౌకా’ వచ్చేసింది. నెట్టంట వైరల్‌గా మారింది.

‘ఒక పాకిస్థాన్‌ అభిమాని టపాసులు తీసుకుని టీ20 వరల్డ్‌కప్‌ చూసేందుకు ఒక పెద్ద టీవీ కొనేందుకు షాప్‌కు వెళ్తాడు. అక్కడ దుకాణం యజమాని భారతీయుడు. ఈసారి వారి టీమ్‌ ఇది అంటూ సిక్సులు కొడితే ఢిల్లీలో సీసాలు పగులుతాయి అంటూ కౌంటర్‌ వేస్తాడు. అందుకు షాపు యజమాని.. టీ20 వరల్డ్‌కప్‌లో ఐదుసారి ఓడిపోబోతున్నారు. మీరు టపాసులు కాల్చండి. ‘బై వన్‌ బ్రేక్‌ వన్‌’ అంటూ రెండు టీవీలు చూపిస్తూ హేళన చేస్తాడు. ఈ యాడ్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. పాకిస్థాన్‌ క్రికెటర్లు భారత్‌ను ఓడించి తీరుతాం అంటూ చేస్తున్న కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.