హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సెన్సేషన్. ఒకప్పుడు బాగా రాణించిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత కెరీర్లోనే గడ్డు పరిస్థితిని ఎదర్కొన్నాడు. వెన్నెముక సర్జరీ తర్వాత కూడా హార్దిక్ పుంజుకోలేక ఎంతో కష్టపడ్డాడు. టీమిండియా బౌలింగ్ చేయకుండా.. బ్యాటింగ్ విషయంలోనూ ప్రభావం చూపలేక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కెరీర్లో గ్యాప్ తీసుకుని కఠోర శ్రమ చేసి తిరిగి పునరాగమనం చేశాడు. తనని తాను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ను ఒక వేదికగా మార్చుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుని పాల్గొన్న తొలి సీజన్లో టైటిల్ కట్టబెట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌కే కాదు కెప్టెన్‌గా కూడా తాను రాణించగలనని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీమిండియాలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చి దంచికొట్టాడు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) ఇప్పుడు ఆసియా కప్ కోసం హార్దిక్ పాండ్యా సంసిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. యూఏఈ వేదికగా ఆగస్టు 28న టీమిండియా- పాక్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ కోసం హార్దిక్ పాండ్యా యూఏఈకి పయనమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హార్దిక్ విదేశీ పర్యటనల్లో మాత్రం ఫ్యామిలీని బాగా మిస్ అవుతుంటాడు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) అలాగే అతని కుటుంబం, భార్య, కొడుకు అంతా హార్దిక్ ను మిస్ అవుతూనే ఉంటారు. హార్దిక్ పాండ్యా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో భార్య నటాషాతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. వాళ్లంతా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఇంకేముంది అవి కాస్తా వైరల్ గా మారాయి. ఒక్కరోజులోనే 1.7 మిలియన్ లైకులు రావడం విశేషం. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) నా భార్యను పొగుడుతూ చేస్తున్న పోస్ట్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఆ పోస్టుపై నటాషా కూడా స్పందించింది. మిస్ యూ అంటూ పక్కన హార్ట్ సింబల్ పెట్టింది. ఆమె చేసిన ఆ కామెంట్‌పై ఫ్యాన్స్ స్పందించారు. మిస్ యూ అంటూ హార్దిక్ తరఫున రిప్లైలు కూడా పెడుతున్నారు. అయితే ఈ ఒక్క పోస్టు ద్వారా హార్దిక్- నటాషా మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో చెప్పొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) ఇదీ చదవండి: వకార్ యూనిస్ ఓవరాక్షన్.. షాహిన్ అఫ్రిదీ లేనందు వల్ల టీమిండియా బతికిపోయిందంట! ఇదీ చదవండి: ‘నాకు 10 వేల మంది మహిళలతో సంబంధాలున్నాయి’.. ఫుట్‌బాల్ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు..