ఐపీఎల్ 2022లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్థిక్పాండ్యాపై కర్మ సిద్ధాంతం పనిచేసింది. వివరాల్లోకి వెళితే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి ఆడిన అప్పర్ కట్ షాట్ బాల్ కాస్తా.. థర్డ్ మ్యాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న షమీకి చాలా ముందు పడింది. ఆ బాల్‌ను క్యాచ్ పట్టేందుకు షమీ ప్రయత్నించలేదని హార్థిక్ పాండ్యా.. షమీపై నోరుపారేసుకున్నాడు.
తనకంటే సీనియర్ ప్లేయర్ అని కూడా చూడకుండా.. నోటికొచ్చిన బూతులు తిట్టాడు. నిజానికి షమీ క్యాచ్ కోసం ప్రయత్నించకుండా బౌండరీ ఆపాడు. ఒకవేళ క్యాచ్ ప్రయత్నించి ఉంటే నాలుగు పరుగులు వచ్చేవి ప్రత్యర్థికి.. అయినా కూడా పాండ్యా అలా ప్రవర్తించడంతో షమీ మౌనంగా ఉండిపోయాడు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాజాగా.. గురువారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌లో పాండ్యా భీకర ఫామ్‌లో ఉన్న హెట్మేయిర్ క్యాచ్‌ను వదిలేశాడు. కేవలం ఒక్క రోజు గ్యాప్‌తో సీన్ రివర్స్ అయింది.
కేవలం తన బౌలింగ్‌లో క్యాచ్‌కు ప్రయత్నించలేదని షమీపై నోరుపారేసుకున్న పాండ్యా.. ఇప్పుడు అదే షమీ బౌలింగ్‌లో వచ్చిన క్యాచ్‌ను నేలపాలుచేశాడు. కానీ.. పాండ్యా లాగా షమీ నోరుపారేసుకోలేదు. చాలా హుందాగా ప్రవర్తించాడు. దీంతో మరోసారి పాండ్యాపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్ అనే దర్పంతో ఒక సీనియర్ ప్లేయర్‌పై నోరుపారేసుకున్నావ్.. ఇప్పుడు నువ్వే క్యాచ్ వదిలేశావ్, తిట్టినంత ఈజీ కాదు, క్యాచ్ పట్టడం అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బట్లర్‌ను చూసి నేర్చుకోవాలి: యువరాజ్ సింగ్
When roadside chapri become a cricketer ! This is what we can expect from a chapri Cricketer.. totally mannerless Hardik #HardikPandya #SRHvsGT pic.twitter.com/09PP8jt0Xn
— Ashraful Islam (@imAshraf_Vk) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.