‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో భారత్ సెమీస్ ఆశలు గల్లంతైన విషయం తెలిసిందే. కెప్టెన్ గా కోహ్లీకి ఈ కప్పు బహుమతిగా ఇద్దాం.. అందుకు అందరూ కృషి చేయాలి అంటూ రైనాలాంటి వారు చేసిన వ్యాఖ్యలు కూడా ఉపయోగం లేకుండా పోయాయి. మొదటి రెండు మ్యాచ్‌ల పరాయజయాలే టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతు కావడంలో ముఖ్య పాత్రపోషించాయి. తర్వాతి మ్యాచ్‌లు గెలిచినా ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు పాకిస్థాన్ ఐదుకు ఐదు గెలిచి గ్రూప్ 2లో టేబుల్ టాప్‌గా సెమీస్ చేరింది. టీమిండియా త్వరగా మేలుకొని ఉండిఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిమానులు, విమర్శకులు ఎద్దేవా చేస్తున్న విషయం తెలిసిందే. టీమిండియాకు సంబంధించిన విషయాల్లో తనదైనశైలిలో స్పందించే గౌతమ్ గంభీర్.. తాజాగా టీ20 కెప్టెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఇదీ చదవండి: జవాన్ల మధ్య కాల్పులు… నలుగురి మృతి
కోహ్లీ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ ఎవరు అనే దానిపై గౌతమ్ గంభీర్ స్పిందించాడు. ఆ స్థానానికి రోహిత్ శర్మానే కరెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. తన వాదనకు బలం చేకూర్చేలా రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌ను ఉదాహరణగా చూపుతున్నాడు గంభీర్. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన రోహిత్ శర్మనే టీమిండియా టీ20 జట్టును లీడ్ చేయాలంటూ అభిప్రాయపడ్డాడు. అంతకన్నా ఏం కావాలి? అంటూ ప్రశ్నించాడు. ‘రాహుల్- రోహిత్ శర్మ ద్వయం టీమిండియాకి ఐసీసీ ట్రోఫీ తెచ్చిపెడతారు’ అంటూ తన మనసులోని మాటను, వారిపై తనకున్న విశ్వాసాన్ని వెల్లిబుచ్చాడు గౌతమ్ గంభీర్.