క్రీడా ప్రపంచంలో కొన్ని కొన్ని జట్లు మ్యాచ్ లు ఆడుతున్నాయి అంటే చాలు.. క్రీడా అభిమానులకు ఎన్ని పనులు ఉన్నాగానీ వాటిని పక్కన బెట్టి ఆ మ్యాచ్ చూస్తారు. అలాంటి జట్లలో ముందు వరుసలో ఉండే ప్రత్యర్దులు భారత్-పాక్. దాయదులు పోరుగా క్రికెట్ విశ్లేషకులు ఈ ఆటను వర్ణిస్తారు. అందుకు తగ్గట్టుగానే అభిమానులు కూడా ఈ మ్యాచ్ ను చూస్తారు. తాజాగా ఆసియా కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ ను రికార్డు స్థాయిలో హాట్ స్టార్ లో వీక్షించారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే చాలు అందరూ దాన్ని ఓ యుద్ధంలా చూస్తారు. అందుకు తగ్గట్లుగానే ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు క్షణాల్లో జరిగిపోయాయి. ఈ క్రీడా యుద్ధాన్ని ప్రత్యక్షంగా ఎవరు చూడాలి అనుకోరు చెప్పండి. ఇక ప్రపంచంలో ఏ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినా ఇంత క్రేజ్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్టుగా క్రికెట్ అభిమానులే కాదు సాధారణ పౌరులు సైతం ఈ ఆటను చూస్తారు.
ఇప్పుడు ఈ మ్యాచ్ ఓ రికార్డు ను క్రియేట్ చేసింది. హాట్ స్టార్ లో ఎక్కువ మంది చూసిన మ్యాచ్ గా నిలిచింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ను ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 13 మిలియన్ల మంది చూశారు. అంటే 1.30 కోట్ల మంది చూశారు అన్నమాట. ఇది 2022లోనే అత్యంత ఎక్కువ మంది చూసిన మ్యాచ్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ విషయాన్ని హాట్ స్టార్ తెలిపింది. ఈ విషయం తెలిసిన క్రీడాభిమానులు మరేమనుకున్నారు దాయదుల పోరు అంటే.. అని కామెంట్స్ చేస్తున్నారు. మరి 2022లోనే అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్ గా భారత్-పాక్ మ్యాచ్ రికార్డు చేయడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
