గప్టిల్‌ యాక్షన్‌ కు.. దీపక్‌ చాహర్‌ అదిరిపోయే రియాక్షన్‌..

Deepak Serious Look to Guptil - Suman TV

‘న్యూజిలాండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా 2021’లో టీమిండియా శుభారంభం చేసింది. 3 టీ20ల సిరీస్‌లో 1-0తో భారత్‌ ఆధిక్యంలోకి చేరింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు బ్యాటింగ్‌తో విజయం చేరువైంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో టీమిండియా స్కోర్, తీసిన వికెట్లు, రోహిత్‌, స్కై షాట్ల గురించి ఎవరూ మాట్లాడుకోవట్లేదు. గప్టిల్‌ నో లుక్‌ సిక్స్‌, దీపక్‌ చాహర్‌ డెడ్లీ లుక్‌ గురించే అంతా హాట్‌ టాపిక్‌ అయ్యింది.

నో లుక్‌- డెడ్లీ లుక్‌..

అప్పటికే క్రీజులో నిలదొక్కుకుని.. టీమిండియా ప్రతి బౌలర్‌ను బాదేస్తున్న గప్టిల్‌ స్పీడుకు దీపక్‌ చాహర్‌ బ్రేకులు వేశాడు. లేదంటే స్కోరు ఇంకా పెరిగిపోయి ఉండేది. అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న గప్టిల్‌.. 17వ ఓవర్‌ తీసుకున్న దీపక్‌ చాహర్‌కు మొదటి బంతికే షాక్‌ ఇచ్చాడు. చాహర్‌ వేసిన బంతిని గప్టిల్‌ భారీ సిక్స్‌ బాదాడు. అది కూడా నో లుక్‌ సిక్స్‌. చాలా గర్వంగా దీపక్‌ చాహర్‌ను చూసినట్లు అనిపించింది. తర్వత బంతిని దీపక్‌ చాహర్‌ అదే తరహాలో వేస్తే.. మళ్లీ సిక్స్‌గా మలచబోయి బౌండరీ దగ్గర గప్టిల్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అప్పుడు దీపక్‌ చాహర్‌ ఇచ్చిన డెడ్లీ లుక్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తోంది. మరి ఆ వైరల్‌ వీడియోని మీరూ చూసేయండి.