పండంటి కూతురుకి జన్మనిచ్చిన భువనేశ్వర్‌ కుమార్‌ దంపతులు

Bhuvaneswar Kumar

టీమిండియా స్టార్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ దంపతులకు పండంటి ఆడ కూతురి జన్మించింది. అయితే ఈ దంపతులు బుధవారం నాలుగో వివాహ బంధలోకి అడుగు పెట్టారు. అలా పెళ్లి రోజు జరిగిన మరుసటి రోజే ఆడపిల్ల పుట్టిందని తెలియటంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదే విషయాన్ని ఇంటికి దూరంగా ఉన్న భువనేశ్వర్ కు కుటుంబ సభ్యులు ఫోన్ లో చెప్పటంతో ఉబ్బితుబ్బిపోయాడట.

అయితే భువనేశ్వర్‌- నుపుర్‌ నగర్‌ దంపతులు 2017 నవంబరు 23న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ముగిసిన ఇండియా- న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ ఇంటికి దూరంగా ఉన్నాడు. ఇక భువికి కూతురు జన్మించటంతో ఎంతో సంతోషంగా ఉన్నాడట. ఈ విషయం ఆయన అభిమానులకు తెలియటంతో కాంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక టీమిండియాలో భువనేశ్వర్ కుమార్ స్టార్ ఫేసర్ గా దూసుకుపోతున్నాడు.