యుజ్వేంద్ర చాహల్.. ఐపీఎల్ 2022 సీజన్లో అత్యధిక వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. అంతేకాకుండా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టీమిండియాలో మెరవనున్నాడు. జూన్ 9 నుంచి సౌత్ ఆఫ్రికాతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో కీలక బౌలర్ గా మారే అవకాశం కడా లేకపోలేదు. ప్రస్తుతం చాహల్- గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా వాళిద్దరూ తాగి రోడ్డుపై రచ్చ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లివెత్తుతున్నాయి.
ఈ వీడియో నాలుగురోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియోలో చాహల్ అతని భార్యతో కలిసి ఏదో పార్టీకి అటెండ్ అయినట్లుంది. పార్టీ తర్వాత చాహల్ అతని భార్య ఇద్దరూ ఇంటికి వెళ్లేందుకు కారులో కూర్చోబోతుండగా.. అక్కడికి వచ్చిన ఆశిష్ నెహ్రా- చాహల్ ను బస్ లో రావాలని కోరాడు. అందుకు చాహల్ భార్యను వదిలేసి రామంటావా? అని ప్రశ్నించాడు. ఆమె కూడా మనతో వస్తుందిలే అంటూ వెళ్లి ధనశ్రీని కూడా వారితో రావాలంటూ నెహ్రా రిక్వెస్ట్ చేస్తాడు.
నిజానికి నెహ్రా- చాహల్ తో ఎంతో చనువుగా ఉంటాడు. నెహ్రా ఆర్సీబీ కోచింగ్ టీమ్లో ఉన్నప్పటి నుంచే వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉండేవారు. క్లోజ్ గా ఉండేవారి మధ్య అలాంటి సంభాషణలో తప్పేముంది అనుకోవచ్చు. అయితే వారి ప్రవర్తన, సంభాషణ చూసిన నెటిజన్లు ఇద్దరూ తాగి రోడ్డుపై రచ్చ చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాహల్- నెహ్రా ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.