కోహ్లీకి తనకి తేడా చూపించిన రోహిత్ శర్మ! లక్కీ కెప్టెన్!

Rohith Sharma ind vs nz

ఏ ఆటలో అయినా విజయం సాధించాలంటే  కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా కలసి రావాలి. ఈ విషయంలో టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ కోహ్లీకి అంతగా అదృష్టం లేదనే చెప్పుకోవాలి. ఆటగాడిగా కోహ్లీ స్థాయి ఎవ్వరూ అందుకోలేనిది. కెప్టెన్ గా కూడా కోహ్లీ రికార్డ్స్ అందరికన్నా ఎత్తులోనే ఉన్నాయి. ఆట పరంగా, కమిట్మెంట్ పరంగా కోహ్లీ పోరాటాన్ని ఏ మాత్రం తక్కువ చేయలేము, చేయకూడదు కూడా. ఇప్పటికీ టీమిండియా ఆశాదీపం కోహ్లీనే. కానీ.., అదృష్టం విషయంలో మాత్రం కోహ్లీ చాలా వెనుక పడిపోయాడు. టాస్ లు గెలవడం కూడా మ్యాచ్ లను నిర్దేశించే రోజులు ఇవి. తాజాగా ముగిసిన టీ 20 వరల్డ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి కీలకమైన మ్యాచ్ లలో కోహ్లీ వరుసగా టాస్ లు ఓడిపోవడం కూడా టీమిండియా కొంప ముంచింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో కూడా  టాస్ ఓడిపోవడమే ఓటమికి ప్రధాన కారణం అయ్యింది. అయితే.., ఇప్పుడు టీ20 పగ్గాలు చేతులు మారాయి. అదృష్టానికి మారు పేరైన రోహిత్ శర్మ టీమిండియా టీ20 కెప్టెన్ అయ్యాడు. దీంతో.. రోహిత్ కెప్టెన్ గా ఎన్నికైన  తొలి సీరీస్ లోనే కోహ్లీకి తనకు మధ్య వ్యత్యాసం చూపించాడు.

న్యూజిలాండ్ తో ముగిసిన మూడు టీ20  సిరీస్ లో రోహిత్ కెప్టెన్ గా సూపర్ “హిట్” అనిపించుకున్నాడు. మూడు మ్యాచ్ లలో రోహిత్ టాస్ గెలవడం విశేషం. ఈ మధ్య కాలంలో టీమిండియా ఇలా వరుసగా టాస్ గెలిచిన దాఖలాలు లేవు. కేవలం అదృష్టం కొద్దీ టాస్ గెలవడం మాత్రమే కాదు. ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ ఈ సిరీస్ లో దుమ్ములేపాడు.

మూడు మ్యాచ్ లలో కలిపి రోహిత్ 159 పరుగులు సాధించడం విశేషం. ఇందులో 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో.. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎన్నిక అయ్యాడు. దీంతో.. లక్ పరంగా, ఆట పరంగా రోహిత్ సూపర్ “హిట్” అంటూ నెటిజన్స్ హిట్ మేన్ పై  ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ట్రోఫీలు దక్కించుకున్నట్టే.. ఇక టీమిండియా కూడా టీ 20లలో విశ్వ విజేతగా నిలవడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.