రషీద్‌ ఖాన్‌ అలకపూనడంతో.. కొత్త కెప్టెన్‌ను ఎంచుకున్న ఆఫ్గనిస్థాన్‌

afghanistan cricket board

ఆఫ్గనిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనూ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్నట్లు ఆఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అంతేకాగు. తుది జట్టులోని ఆటగాళ్లను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. తనను సంప్రదించకుండా జట్టు ప్రకటించారంటూ రషీద్‌ ఖాన్‌ అలకపూనాడు. తాజాగా మహ్మద్‌ నబీని టీ20 వరల్డ్‌కప్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నబీ తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించాడు.

mohammed nabiఏసీబీ ప్రవర్తనపై రషీద్‌ ఖాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఇలా స్పందించాడు.. ‘అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా.. ప్రపంచకప్‌ జట్టు ఎంపికచేసే ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన కనీస బాధ్యత నాకు ఉంటుంది. అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు గానీ, ఎంపిక కమిటీ గానీ నన్ను సంప్రదించలేదు. టీ20 కెప్టెన్సీ నుంచి నేను తప్పుకొంటున్నా. ఆఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఆడటం ఎప్పటికీ నాకు గర్వకారణమే’ అని ట్వీట్‌ చేశాడు. ఇక, ఏసీబీ నిర్ణయంపై మహ్మద్‌ నబీ ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. ‘ఆఫ్గనిస్తాన్‌ జాతీయ క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించాలని ఏసీబీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థుల్లో బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. దేవుడి దయతో టీ20 ప్రపంచకప్‌లో దేశం గర్వపడేలా పోరాడతాం’ అంటూ నబీ ట్వీట్‌ చేశాడు.