రిటైర్మెంట్ సమయంలోనూ భారత్ పై అభిమానాన్ని చాటుకున్న ఏబీ డివిలియర్స్..

Ab Devilliers Indian Players Ipl

సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌ తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాను ఇంగ్లీష్‌, ఆఫ్రికన్‌, హిందీ భాషల్లో ధన్యవాదాలు అంటూ ఏబీడీ తెలిపాడు. ఏబీ డివిలియర్స్‌ గతంలోనే దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మొత్తం క్రికెట్ ఆట నుంచే తప్పుకోనున్నట్లు ప్రకటించటంతో అతని ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నారు.

ఇక ఏబీ డివిలియర్స్‌ కి ఇండియాపై తనకున్న అనుబంధం గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఇండియాలో నిర్వహించే ఐపీఎల్ లో డివిలియర్స్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరుపున కీలక ఆటగాడిగా కొనసాగాడు. దీంతో ఇండియా ఆటగాళ్లతో ఐపీఎల్ ఆడడంతో భారత్ కు ఏబీ డివిలియర్స్‌ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే అతను ఇండియాతో ఉన్న అనుబంధాన్ని హిందీ భాషలో ధన్యవాదాలు అంటూ తెలియజేశాడని ఇండియా క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.