టాలెంట్ ఉంటే ఎప్పుడైనా ఫేమ్ లోకి వస్తారు అని చాలా తక్కువమంది ప్రూవ్ చేస్తుంటారు. అలాంటివారిలో ఒకరు నటుడు సుహాస్. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుండి కెరీర్ స్టార్ట్ చేసి.. సినిమాలలో క్యారెక్టర్స్ తో పాటు ఇప్పుడు హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. హీరోగా అనడం కంటే నటుడిగా అంటే ఇంకా బాగుంటుంది. కలర్ ఫోటో లాంటి ఎమోషనల్ పాథెటిక్ మూవీ తర్వాత.. సుహాస్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘రైటర్ పద్మభూషణ్’. కామిక్ ఫ్యామిలీ డ్రామా జానర్ లో డెబ్యూ డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ మూవీ తెరకెక్కించాడు. సాంగ్స్, ట్రైలర్ తో డీసెంట్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ తాజాగా థియేటర్స్ లో విడుదలైంది. హీరోగా సుహాస్ కి ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!
ఈ మూవీ స్టోరీ విజయవాడలో లైబ్రేరియన్ గా జాబ్ చేసే రైటర్ పద్మభూషణ్(సుహాస్).. అతని తండ్రి(ఆశిష్ విద్యార్ధి), తల్లి సరస్వతి(రోహిణి) క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. గొప్ప రైటర్ కావాలని కలలు కనే పద్మభూషణ్ కష్టపడి ఓ బుక్ రాస్తాడు. పేరెంట్స్ కి తెలియకుండా అప్పుచేసి మరీ తన బుక్ ని పబ్లిష్ చేయిస్తాడు. కానీ.. ఇతని బుక్ ఫ్రీగా ఇచ్చినా ఎవరు చదవరు. కట్ చేస్తే.. రైటర్ పద్మభూషణ్ లైఫ్ లోకి అతని మరదలు(సారిక) ఎంటర్ అవుతుంది. అదే టైంలో కొన్ని ఊహించని పరిణామాల మధ్య పద్మభూషణ్ లైఫ్ చిక్కుల్లో పడుతుంది. దీంతో మరదలితో పెళ్లి కుడా సంధిగ్ధంలో పడి.. షాకింగ్ ట్విస్టులు ఎదురవుతాయి. మరి రైటర్ కావాలన్న పద్మభూషణ్ కల నెరవేరిందా లేదా? ఎందుకు అతని లైఫ్, పెళ్లి చిక్కుల్లో పడ్డాయి? చివరికి లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది? ఎలా లైఫ్ ని ఫేస్ చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
టాలీవుడ్ లో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. సక్సెస్ అయిన నటులలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. ఈ యంగ్ యాక్టర్ సుహాస్ కూడా ఆ కోవకే చెందుతాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఓవైపు హీరోగా సినిమాలు చేస్తున్నాడంటే.. కేవలం అతని టాలెంట్, డెడికేషన్ మాత్రమే కారణాలుగా చెప్పాలి. షార్ట్ ఫిలిమ్స్ తర్వాత సినిమాలలో చిన్న క్యారెక్టర్స్ చేస్తూ.. కలర్ ఫోటో మూవీతో హీరో అయ్యాడు. ఆ సినిమా ఓటిటిలో రిలీజ్ అయినప్పటికీ.. సుహాస్ నటనకు మంచిపేరు తెచ్చింది. ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్స్ చేస్తూ.. తాజాగా హీరోగా ‘రైటర్ పద్మభూషణ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
సుహాస్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి ఎమోషన్స్ అయినా ఈజీగా క్యారీ చేయగలడు అని తన ప్రీవియస్ వర్క్ చూస్తే అర్థమవుతుంది. కానీ.. రైటర్ పద్మభూషన్ మూవీ సుహాస్ కి డెబ్యూ థియేట్రికల్ రిలీజ్. సో.. ఆల్రెడీ సాంగ్స్, డీసెంట్ ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రైటర్ పద్మభూషణ్.. లీడ్ క్యారెక్టర్ ని సుహాస్ ప్లే చేశాడు. అయితే.. ట్రైలర్ లో చూపించినట్లుగానే రైటర్ అవ్వాలని ఓ బుక్ రాసి తెగ తంటాలు పడుతుంటాడు. విజయవాడలో లైబ్రేరియన్ గా జాబ్ సంపాదించుకొని.. తాను రాసిన బుక్ సేల్ అవ్వట్లేదని జనాలకు ఫ్రీగా ఇచ్చేస్తుంటాడు. అయినా సరే ఏ ఒక్కరూ లెక్కచేయరు.
ఈ సినిమా.. రైటర్ పద్మభూషణ్ క్యారెక్టర్ లో సుహాస్ ని పరిచయం చేస్తూ మొదలైంది. తన నేరేషన్ తోనే పేరెంట్స్ క్యారెక్టర్స్.. రెగ్యులర్ లైఫ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు దర్శకుడు. అలా రైటర్ గా గుర్తింపు కోసం పద్మభూషణ్.. నెలకు రెండువేలు మిగిలితే పొంగిపోయే తండ్రి.. హౌస్ వైఫ్ గా ఇంటిపని చేస్తూ సీరియల్స్ చూసే తల్లి.. వీళ్ల ముగ్గురి క్యారెక్టర్స్ తో మంచి ఫన్ క్రియేట్ చేస్తూ ఫస్టాఫ్ సాగించారు. ఇదే ఫస్టాఫ్ లో మరదలు సారిక క్యారెక్టర్ లో హీరోయిన్ ఇంట్రడక్షన్.. పెళ్లి అనౌన్స్ మెంట్ తో అసలు కథలోకి తీసుకెళ్లారు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. కానీ.. వీరి మధ్య సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి.
కట్ చేస్తే.. ఊహించని షాకింగ్ ట్విస్టుల మధ్య ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ ట్విస్టుతో సెకండాఫ్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. అసలు కథ సెకండాఫ్ లో చాలా మలుపులు, ఎమోషన్స్ తో పాటు మధ్యమధ్యలో కామెడీ యాడ్ చేస్తూ లాగించారు. కొత్త కథ కాదు కానీ.. కొత్త స్క్రీన్ ప్లే.. కొత్త ట్విస్టులు.. ఇప్పటిదాకా ఎవరు చూపించని ఎమోషన్స్ తో ప్రేక్షకుల గుండె బరువెక్కేలా చేశారు. ఫస్టాఫ్ లో మెయిన్ క్యారెక్టర్స్ కి సెట్ చేసిన టార్గెట్స్ ని.. సెకండాఫ్ లో ఎలా ఆ క్యారెక్టర్స్ ఫినిష్ చేశాయి అనేది చాలా హృద్యంగా డిజైన్ చేశారు. కథాకథనాలకు అనుగుణంగా సింపుల్ డైలాగ్స్.. మంచి సాంగ్స్.. కథలో ఎమోషన్స్ ని ఎలివేట్ చేసే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా కుదిరాయనే చెప్పాలి.
అలా మొత్తానికి రైటర్ పద్మభూషణ్.. ఆడియన్స్ ని నవ్వించి, కవ్వించి.. ఏడిపించి.. ఇలా అన్నీ ఎమోషన్స్ మధ్య హై ఫీలింగ్ తో బయటికి పంపించేస్తాడు. ఈ సినిమాలో అన్నీ పాత్రలు ప్లస్ అయ్యాయి. అన్నీ పాత్రలలో ఎమోషన్స్.. క్యారెక్టరైజేషన్స్.. సినిమాకి కావాల్సినట్లుగా రాబట్టుకోగలిగాడు దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్. నటీనటుల గురించి మాట్లాడుకుంటే.. రైటర్ పద్మభూషన్ క్యారెక్టర్ లో ఒదిగిపోయి.. అన్నీ ఎమోషన్స్ ని మనసుకు హత్తుకునేలా చేశాడు. నేచురల్ యాక్టర్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. పేరెంట్స్ క్యారెక్టర్స్ లో ఆశిష్ విద్యార్ధి, రోహిణి అదరగొట్టేసారు. వీరి క్యారెక్టర్స్ ఆడియన్స్ ని బాగా హంట్ చేస్తాయి.
ఇక హీరోయిన్ టీనా శిల్పరాజ్.. గోపరాజు రమణ.. హీరో ఫ్రెండ్.. ఇలా మిగతా క్యారెక్టర్స్ అన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. యాక్టర్స్ తర్వాత సినిమాకి మ్యూజిక్ మేజర్ ప్లస్. శేఖర్ చంద్ర పాటలు, కళ్యాణ్ నాయక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ ప్లీజంట్ గా ఉంది. విజయవాడతో పాటు కథలో మిగతా ప్లేసెస్ అన్నీ చక్కగా కవర్ చేశాడు. ప్రొడ్యూసర్స్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్లీ కెప్టెన్ ఆఫ్ ది ఫిల్మ్.. షణ్ముఖ ప్రశాంత్ చక్కని ఎమోషన్స్ తో కూడిన మూవీని తెరపై అంతే అందంగా ప్రెజెంట్ చేశాడు.