Revanth Reddy Meets Bandla Ganesh: బండ్ల గణేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం నిర్మాతగా మారారు. ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికి.. రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతానికైతే రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన తన ఫుల్ ఫోకస్‌ని సినిమాల మీదనే పెట్టారు. ఈ క్రమంలో అనుకోని ఓ సంఘటన చోటు చేసుకుని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. అదేంటంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బండ్ల గణేష్‌తో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వీరి భేటీ కొనసాగింది. ఆ వివరాలు.. సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం బండ్ల గణేశ్ నివాసానికి వెళ్లిన రేవంత్ దాదాపు 2గంటలపాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న గణేశ్‌ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు కోరినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: Bandla Ganesh: తెలుసుకొని మాట్లాడాలంటూ.. బండ్ల గణేష్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్! ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బండ్ల గణేశ్ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తి చూపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో డీలాపడ్డారు. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలకు సంబంధించిన అంశాలపై ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు కానీ, ఎక్కడా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో బండ్ల గణేశ్ ను యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Bandla Ganesh: పూరీ జగన్నాథ్ చుట్టూ ర్యాంప్ లు, వ్యాంప్ లు మధ్యలో వచ్చారు: బండ్ల గణేష్!