ఈటలకు షర్మిల ఆహ్వానం!

తెలంగాణ రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికార పార్టీ టి.ఆర్.ఎస్ కి నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో తిరుగులేదు. కానీ.., ఒకరి తరువాత ఒకరిగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ.., ఆయన ప్రత్యర్ధులు పెరిగిపోయారు. ఇక తాజాగా ఈటల రాజేందర్ పార్టీ నుండి బయటకి రావడంతో కేసీఆర్ పై విమర్శలు చేసే వారి సంఖ్య మరింతగా పెరిగింది. అయితే.., మిగతా వారితో రాజకీయ పోరు ఎలా ఉన్నా.., ఈటలతో మాత్రం కేసీఆర్ కి తలనొప్పులు తప్పవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ సాధనలో కేసీఆర్ కష్టం ఎంతో, ఈటలది కూడా అంతే. పైగా.., తెలంగాణ సమాజంలో ఈటల రాజేందర్ కి ప్రత్యేక స్థానం ఉంది. అన్నీటికీ మించి కేసీఆర్ కష్ట, నష్టాలు, బలాలు, బలహీనతలు తెలిసిన నేత ఈటల. కాబట్టి.. ఈటల రాజేందర్ ఇప్పుడు ఏ పార్టీలో చేరితే, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్న్యాయంగా మారే పరిస్థితిలు నెలకొన్నాయి. కాగ.. ఈటల బీజేపీలో చేరడం ఇప్పటికే ఖాయం కాగా.., ఇప్పుడు వై.ఎస్. షర్మిల చేసిన కొన్ని కామెంట్స్ చర్చకి కారణం అవుతున్నాయి.

sha 2ఈటల రాజేందర్ మా పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని షర్మిల అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్లో బుధవారం షర్మిల సమావేశం నిర్వహించారు. షర్మిల ఈ సందర్భంగా ఈటల బీజేపీలో చేరే విధానాన్ని తప్పు బట్టారు. కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని అన్నారు షర్మిల. వారంతా కేసులకు భయపడి బీజేపీలో చేరిపోతున్నారు. దీనివల్ల తెలంగాణ సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. అలా కాకుండా ప్రజల కోసం అలోచించి ఈటల రాజేందర్ కనుక తమ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని షర్మిల స్పష్టం చేశారు. కానీ.., ఇప్పటి వరకు ఈటల విషయంలో తమ పార్టీలో ఎటువంటి చర్చ జరగలేదని షర్మిల తెలియచేసింది. ఇక ఇదే మీటింగ్ లో తన పార్టీ పేరు, గుర్తుపై కూడా షర్మిల స్పందించారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందన్నారు. తమ పార్టీ గుర్తు టేబుల్ ఫ్యాన్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఇప్పటి వరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. పార్టీ విధి, విధానాలు, జెండా, అజెండాలు ఏవైనా ప్రజల్లోకి వెళ్ళాకనే ఫైనలా అవుతాయని షర్మిల స్పష్టం చేశారు. మరి.., ఈటలను షర్మిల తన పార్టీలోకి ఆహ్వానించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.