తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరుతూ ఆయనకు లేఖ రాశారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన ట్వీట్టర్ ఖాతాలో వెల్లడించారు. రాష్ట్రంలో జరుతున్న అవినీతిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వివరించేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరినట్లు పేర్కొన్నారు. కాగా త్వరలో అమిత్‌షా హైదరాబాద్‌కు రానున్నారు. ఆ సమయంలో ఆయనతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.