బిగ్‌ బ్రేకింగ్‌: టీఆర్‌ఎస్‌ నేతలను ఉరికించి కొట్టిన రేవంత్‌రెడ్డి అనుచరులు.. వీడియో వైరల్‌

Rewanth Reddy followers who hanged TRS leaders Video viral - Suman TV

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మంగళవారం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం, ఇంటి ముట్టడికి యత్నించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై రేవంత్‌ అనుచరులు దాడి చేశారు. రేవంత్‌ రెడ్డికి చేరుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు నిలువరించేందుకు ప్రయత్నించగా గమనించిన రేవంత్‌రెడ్డి అనుచరులు వారి వద్దకు చేరుకున్నారు. వారిపై టీఆర్‌ఎస్‌ నాయకులు రాళ్లు విసరడంతో ఆగ్రహించిన రేవంత్‌ రెడ్డి అనుచరులు వారిని రేవంత్‌ ఇంటి నుంచి పెద్దమ్మగుడి వరకు పరగెత్తించి కర్రలతో కొట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ భయనక వాతావరణం నెలకొంది.