చంద్రబాబు ఏడవటంపై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

RGV chandrababu

ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సంఘటనలో తప్పు ఎవరిదనేది పక్కన పెడితే రాజకీయ దుమారం రేగింది. అసెంబ్లీ సాక్షిగా ‘ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభలా ఉందని, నేను మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతాను’ అని చంద్రబాబు శపథం చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో రాజకీయ ప్రస్తావనల్లోకి తన భార్యను లాగి అవమానించారంటూ చంద్రబాబు ఏడ్చేశారు. ఈ ఘటను సమర్థిస్తున్నవారు.. విమర్శిస్తున్న వారు లేకపోలేదు. ఈ అంశంపై వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ తనదైనశైలిలో స్పందించాడు. ఏడ్చే మగాళ్లను నమ్మకూడదు అని అర్థం వచ్చేలా ట్వీట్‌ చేశాడు.

“ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను.. కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి. కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుంది” అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఆర్జీవీ కామెంట్స్‌ పై మీ అభిప్రాయాన్ని కామెంట్‌ చేయండి.