రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ కీలక వ్యాఖ్యలు

Banda Prakash Currency Notes Trs

రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమై 2022 ఏప్రిల్‌ 14వరకు జరిగే జ్ఞానయుద్ధ యాత్ర ప్రారంభమవుతోంది. అయితే దీనికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదర్‌గూడలోని ప్రకాష్‌ ముదిరాజ్‌ కార్యాలయంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే బండా ప్రకాష్ మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటోలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఇదే అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించి చర్చించేందుకు చొరవ తీసుకుంటానని తెలిపారు. అయితే గతంలో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలంటూ దళిత సంఘాల నాయకులు కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బండా ప్రకాష్ ఈ వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.