వపన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రాజకీయ విమర్శలకు వేదిక అయ్యిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఏపీలో సినిమా టికెట్ ధరలకు సంబంధించిన వివాదానికి ఇంకా శుభం కార్డు పడలేదు. ఫిబ్రవరి 24న సినిమా టికెట్ల ధరకు సంబంధించి ప్రభుత్వం జీఓ విడుదల చేయాల్సి ఉండగా.. మేకపాటి గౌతం రెడ్డి మృతితో.. వాయిదా పడింది. దీనిపై విపక్షాలు ముఖ్యంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రభుత్వం పవన్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏకంగా టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్, నారా రోహిత్ కూడా పవన్ కు మద్దతుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ట్వీట్ చేశారు. దీనిపై అటు ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించి.. టీడీపీ నేతలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం @ysjagan వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది.(1/4)
— N Chandrababu Naidu (@ncbn) February 25, 2022
ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ లు వ్యవహరించిన తీరుపై ఏపీ రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో రెండు నెలలుగా సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు, లోకేష్ లు ఏ హీరోకి ఇంత మద్దతు తెలపలేదు. అలాంటిది సడెన్ గా పవన్ పై ఇంత అభిమానం ప్రదర్శించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే చంద్రబాబు చర్యల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి అవేంటో చూద్దాం.
Hearing tremendous response for #BheemlaNayak. Looking forward to watching it. @ysjagan wants to transform AP into a begging bowl by finishing off one industry after another, movie industry being no exception. I wish #BheemlaNayak overcomes all conspiracies to come out triumphant pic.twitter.com/cqn636HsCU
— Lokesh Nara (@naralokesh) February 25, 2022
ఇది కూడా చదవండి : పులివెందుల్లో జగన్ ఓటమి సాధ్యమా? చంద్రబాబు పద్మవ్యూహం!
ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. 2019 ఎన్నికల ఓటమి అనంతరం కీలక నేతలు అంతా సైలెంట్ అయ్యారు. కొందరు పార్టీని విడిచి వెళ్లగా.. ప్రస్తుతం ఉన్న వారు కూడా అంత యాక్టీవ్ గా లేరు. కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులకు కూడా కొరత ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీని నిలబెట్టుకోవడానికి, తిరిగి ఫామ్ లోకి రావడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాట్లుగా తెలుస్తోంది. ఒంటరి పోరాటం కన్నా.. ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగడం బెటర్ అని ఆలోచిస్తున్నారట చంద్రబాబు. ప్రస్తుతానికి బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు కుదరదు. భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేం.
ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది…నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.(4/4)
— N Chandrababu Naidu (@ncbn) February 25, 2022
ఈ క్రమంలో ఏపీలో మరో బలమైన నాయకుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు ఆసక్తిగానే ఉన్నారు. గతంలో కూడా జనసేనపై పొత్తు గురించి చంద్రబాబు వన్ సైడ్ లవ్ సరికాదంటూ.. జనసేనతో పొత్తు తనకు ఇష్టమే అని చెప్పకనే చెప్పారు. అయితే చంద్రబాబు, జనసేనతో పొత్తు గురించి ఆలోచిండానికి ప్రధాన కారణం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.
ఇది కూడా చదవండి : ఏపీలోనూ వై.ఎస్. షర్మిల పార్టీ! జగన్ పై ఉండవల్లి మాస్టర్ ప్లాన్!
ఐదేళ్ల పాలనలో అధికార పార్టీపై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. విపక్షాలు దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంటాయి. ఇలాంటి సమయంలో విపక్ష పార్టీలు దేనికవే పోటీ చేస్తే.. వ్యతిరేక ఓటు పార్టీల మధ్య చీలిపోయి.. ప్రభుత్వానికే ప్రయోజనం కలుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. ఈ ఓట్లు చీలకూడదు. దానికి ఉత్తమమైన మార్గం.. పొత్తు, ఒకరికి ఒకరు మద్దతిచ్చుకోవడం. ప్రస్తుతం చంద్రబాబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలవాలని టీడీపీ అభిప్రాయంగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా విషయంలో చంద్రబాబు పవన్ కు మద్దతు తెలుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే చంద్రబాబుతో పొత్తు అంటే ఎలా ఉంటుందో పవన్ కు తెలియని విషయం కాదు. మరి ఈ ఆలోచనపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.